ఫౌంటెన్ టూల్

ఫౌంటెన్ టూల్ అనేది వికీమీడియా టూల్‌ఫోర్జ్లో రూపొందించిన సాధనాల్లో ఒకటి, దీనిని ఎడిట్-ఎ-థాన్స్/పోటీలను నిర్వహించడానికి ఉపయోగించవచ్చు. మొదట దీనిని ప్రధానంగా వికీపీడియా ఏషియన్ మంత్ నిర్వహణకు రూపొందించారు. క్రమంగా ఇతర ఎడిట్-ఎ-థాన్స్ లో కూడా ఉపయోగిస్తున్నారు.
ఉదాహరణకు వికీపీడియా ఏషియన్ మంత్/ఫౌంటెన్ టూల్ చూడండి
పోటీలో పాల్గొనేవారికి, న్యాయనిర్ణేతలకు, నిర్వాహకులకు సూచనలు, ఉపయోగించే దశలవారీ ప్రక్రియ
పోటీలో పాల్గొనేవారికి సూచనలు
- https://fountain.toolforge.org/ కు వెళ్ళండి
- లాగిన్ పై క్లిక్ చేసి, మీ వికీమీడియా ఖాతాను ఉపయోగించి లాగిన్ అవ్వడానికి OAuth అనుమతి ఇవ్వడానికి బటన్ నొక్కండి.
- మీరు వ్యాసం సమర్పించాలనుకుంటున్న పోటీ ఎంచుకోండి
- "సబ్మిట్" పై క్లిక్ చేసి, వ్యాస శీర్షికను నమోదు చేసి, "నెక్స్ట్" పై క్లిక్ చేయండి.
- సరిఅయిన శీర్షిక గమనించాక, దిగువ కుడి మూలలో Add పై క్లిక్ చేసి వ్యాసాన్ని సమర్పించాలి.
- ఎప్పుడైనా లాగిన్ అవ్వవచ్చు ఇంకా ఇతరులు కూడా ఎన్ని వ్యాసాలను సమర్పించారో, న్యాయమూర్తులు ఎన్ని వ్యాసాలను సమీక్షించి, గుర్తించారో చూడవచ్చు.
జ్యూరీ సభ్యులు(న్యాయనిర్ణేతల) కోసం
(జ్యూరీ సభ్యులు పోటీ కొనసాగుతున్నప్పుడు కూడా సమీక్ష ప్రారంభించవచ్చు)
- https://fountain.toolforge.org/ కు వెళ్ళండి
- లాగిన్ పై క్లిక్ చేసి, మీ వికీమీడియా ఖాతాను ఉపయోగించి లాగిన్ అవ్వడానికి OAuth అనుమతి ఎంచుకోండి.
- మీకు సంబంధించిన పోటీ ఎంచుకోండి
- సాధనంలోన్యాయనిర్ణేత పై క్లిక్ చేయండి. మీరు సమీక్షించడానికి వ్యాసం తెరుచుకుంటుంది.
- ఎగువ కుడి మూల వాడుకరి పేరు, వ్యాసానికి సంబంధించి బైట్ల సంఖ్య, పదాల సంఖ్య కనపడుతుంది.
- దిగువ ఎడమ మూలలో, "అవును"(Yes), "లేదు"(No), "వ్యాఖ్య" (Comment) అనే మూడు ఎంపికలు ఉన్నాయి. పోటీ నియమాలు, వ్యాసం నాణ్యత ఆధారంగా తగిన బటన్ ఎంచుకుని, తదుపరి వ్యాసానికి వెళ్లడానికి "సేవ్ (Save)" క్లిక్ చేయండి.
- ఈ వ్యాసాన్ని తరువాత పునఃసమీక్షించాలనుకుంటే లేదా మరొక జ్యూరీ సభ్యుడికి వదిలివేయాలనుకుంటే మీరు "దాటవేయండి" (Skip) కూడా క్లిక్ చేయవచ్చు.
విజేతలకు సందేశాలు/బార్న్స్టార్స్ పంపడానికి స్టెప్స్
- పోటీ ముగిసిన తరువాత ఈ సాధనంలో పోటీ పేజీని తెరిచి, "న్యాయనిర్ణేత (Judge)"బటన్ పక్కన ఉన్న "అవార్డు" బటన్ క్లిక్ చేయండి.
- ఇది అగ్రశ్రేణి కంట్రిబ్యూటర్ల పేర్లను, ప్రతి వాడుకరి ఒక్కరి క్రింద ఖాళీ పెట్టెను ప్రదర్శిస్తుంది.
- ఈ పెట్టెలో మీ సందేశాన్ని రాయవచ్చు. తరువాత “~~~~”తో ముగించి సంతకం చేయండి.
- “Award” మీద క్లిక్ చేసి సందేశం (మెసేజ్) పంపండి
నిర్వాహకుల కోసం
మీరు ఎడిటథాన్ ఈ సాధనము ద్వారా సృష్టించడానికి ముందు డెవలపర్, LE LOY ని సంప్రదించండి. సాధనం కోసం ఈ క్రింది లింక్ లో OAUTHతో లాగిన్ అయి https://fountain.toolforge.org/editathons/new/config [క్రియేట్ న్యూ]" క్లిక్ చేయండి. తెరుచుకున్న ఫారంలో ప్రతి దశలో అభ్యర్థించిన ఖాళీలను పూరించండి.
Old method
ఫౌంటెన్ సాధనంలో పోటీ/ఎడిట్-ఎ-థోన్ సృష్టించమని అభ్యర్థించడానికి, మీరు ఎడిట్-ఏ-థోన్ వివరాలు పూరించండి.
బహిరంగ అభ్యర్థనలు
- Fountain tool/Mois asiatique 2024/Novembre 2024
- Fountain tool/Jocs Olímpics París 2024
- Fountain tool/Orgullo2024
- Fountain tool/WWUA01
- Fountain tool/Konbit Wiki Kreyolo/2023
- Fountain tool/Quinzaine des autrices/March 2023
- Fountain tool/ವಿಕಿಪೀಡಿಯ ಏಷ್ಯನ್ ತಿಂಗಳು ೨೦೨೧
- Fountain tool/Wiki Loves Women South Asia 2021
- Fountain tool/China-Nigeria Wiki Collaboration( English)/August 2021
- Fountain tool/מסע בין כוכבים - ויקיפדיה העברית
- Fountain tool/ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા ઍડિટાથોન ૨૦૨૦ November 2020
- Fountain tool/Wikipedia Asian Month 2020 ja
- Fountain tool/Wikipedia Asian Month 2020 fr
- Fountain tool/Wikipedia Asian Month 2020
- Fountain tool/WikiForHumanRights 2019 Portuguese Wikipedia/12 2019
- Fountain tool/Sample Edit-a-thon/September 2019