Jump to content

Fundraising 2010/Kartika Appeal/te

From Meta, a Wikimedia project coordination wiki

కార్తీకా

[edit]
  • దయచేసి చదవండి:
  • వికీపీడియా రచయిత కార్తీకా నుండి
  • ఒక వ్యక్తిగత విజ్ఞప్తి


  • వికీపీడియా రచయిత కార్తీకా నుండి ఒక సందేశం

133 లక్షలు మరియు సున్నా.

ప్రతీ రోజూ ఎంతమంది జ్ఞానం కొరకు వికీపీడియా వైపు చూస్తారు? 130 లక్షల పైన. ప్రపంచంలో 5వ ప్రసిద్ధమైన వెబ్‌సైటుని చూడడానికి వారు ఎంత చెల్లిస్తారు? అస్సలేమీలేదు.

అదీ వికీపీడియా అంటే.

ప్రపంచప్రజలందరు వారికి తెలిసినవి పంచుకొనటానికి దీనికంటే శక్తివంతమైన పద్ధతి ఇంతవరకు లేదు: సత్యమైన విషయాలు మరియు దత్తాంశాలను పంచుకొనుటకే కాక, వ్యాసాల తయారీలో పాలుపంచుకొని వాటి స్పష్టతని, సత్యవంతమైనవిగా మెరుగుపరచటానికి. వికీపీడియా గొప్పదనమేమిటంటే, దానిలో గల జ్ఞానాన్ని ఔత్సాహికులు ఒకటి తరువాత ఒకటిగా చేర్చి చేసినదే. వికీపీడియా పూర్తిగా ప్రకటన రహితం మరియు వుచితం కాబట్టి, మనమందరము విరాళాల ద్వారా దానిని సుస్థిర పరచాలి. అదే ప్రతి సంవత్సరానికొకసారి మనంచేసే విరాళాల సేకరణ ప్రచారం. మనం తయారు చేసిన దానిని సుస్థిరం చేయటానికి, వికీపీడియాపై ఆధారపడే వారందరు కలసి పాలుపంచుకోగల ఒక అవకాశం.

నేను విరాళం యిచ్చాను. అలాగే మీరు కూడా విరాళం యివ్వటానికి యిప్పడే నిర్ణయించి, $20, €30, ¥4,000 లేక మీకు తోచినంత ఇచ్చి వికీపీడియా స్వేచ్ఛగా కొనసాగటాన్ని కాపాడండి. చాలా మంది జ్ఞానం కోసం నా భాషలో వెతుకుతున్నారు కాని అది వారికి అందుబాటులో లేదు అన్న భావనే నేను వికీపీడియాలో వ్యాసాలు రాయటం మొదలుపెట్టటానికి కారణం.

ప్రపంచం ప్రజలందరు అలాగే చేస్తున్నారు కాబట్టే వికీపిడియా విలువైనదిగా మారింది

ఈరోజే విరాళమిచ్చి వికీపీడియాని శక్తివంతంగా కొనసాగటానికి తోడ్పడండి.

ధన్యవాదాలు,

కార్తీకా, జకర్తా, ఇండోనేషియా