Image filter referendum/Email/te

From Meta, a Wikimedia project coordination wiki

బొమ్మల ప్రదర్శన నియంత్రించు ఉపకరణము[edit]

ప్రియమైన $username,

దీని ద్వారా ఐచ్ఛికంగా చేర్చుకునే వ్యక్తిగత బొమ్మల నియంత్రణ ఉపకరణం తయారీ మరియు వాడుకకు ఈ అభిప్రాయ సేకరణ లో వోటు వేయడానికి మీరు అర్హులు. దీనితో చదువరులు వారి ఖాతాతో వాడుతున్నప్పుడు కొన్ని వర్గాలకు చెందిన బొమ్మల ప్రదర్శనపై నియంత్రణ కలిగిస్తుంది.

వికీమీడియా ప్రాజెక్టులలో ఇష్టంలేని బొమ్మలను మొదటసారి చూచినప్పుడు లేక ఐచ్ఛికాల ద్వారా కనబడకుండా దాచటమే దీని ఉద్దేశం. దీనివలన వాడుకరికి వారి ఇష్టాలకనుగుణంగా వాడుకోగలుగుతారు. దానిని చాలా సాధారణంగా మరియు సులభంగా వాడుకునేటట్లు చేయాలి. సంపాదకులకు కూడా సులభంగా వుండాలి.

ఈ సౌలభ్యం అన్ని వికీమీడియా ప్రాజెక్టులకు వర్తిస్తుంది. ఇది బొమ్మలను తొలగించదు. ఇష్టానుగుణంగా కనబడకుండా మాత్రమే చేస్తుంది. దీనితయారీకి, మేము కొన్ని నియమాలు చేశాము కానివాటికి అవసరానికి తగ్గట్టు తయారీ ప్రక్రియ లో సర్దుబాట్లు జరుగుతాయి. ఈ సర్దుబాట్లు కొరకు, ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మీ ప్రాధాన్యతలను తెలియచేసి సహాయం చేయండి.

మరిన్నివివరాలకు <http://meta.wikimedia.org/wiki/Image_filter_referendum/te> చూడండి. దీనికిసంబంధించిన వార్తలు రాకుండా వుండాలంటే, మీ వాడుకరి పేరు <http://meta.wikimedia.org/wiki/Wikimedia_nomail_list> లో చేర్చండి.