Image filter referendum/FAQ/te

From Meta, a Wikimedia project coordination wiki
అభిప్రాయ సేకరణ 30 ఆగష్టు 2011 న ముగిసింది. వోట్లు అనుమతించబడవు
ఫలితాల ప్రకటన 1 సెప్టెంబరు 2011 న జరిగింది.

బొమ్మల ప్రదర్శన నియంత్రించు ఉపకరణము

సంస్థ

తరచూ అడిగే ప్రశ్నల ఇక్కడ చూడవచ్చు. వ్యక్తిగత ప్రశ్నలు మరియు ఇతర చర్చలకు Talk:Image filter referendum చూడండి.

వ్యక్తిగత బొమ్మల ప్రదర్శన నియంత్రించు ఉపకరణం అంటే ఏమిటి?[edit]

ఖాతాలో ప్రవేశించి వాడేవారికి మరియు అనామకంగా వాడేవారికి, వికీమీడియా ప్రాజెక్టులపై చూడటానికి ఇష్టపడని బొమ్మలను కనబడకుండాచేసే సౌలభ్యం అవకాశాన్ని ఇస్తుంది.

దీని తయారీలో సూత్రాలు ఏమి?[edit]

  1. ఇది అవసరమైతే చేర్చుకునే సౌలభ్యం. మొత్తము వికీమీడియా సమాచారం అన్ని విహరిణులపై అప్రమేయంగా ఎక్కించబడుతుంది. మొత్త సమాచారం తెచ్చుకున్న తరవాత, వాడుకరి ఇష్టాన్ని బట్టి ఇది పనిచేస్తుంది.
  2. ఇది వొక వ్యక్తిగత ప్రక్రియ. మీ నిర్ణయం మీ వరకు మాత్రమే.
  3. బొమ్మలు ఈ సౌలభ్యం వలన తొలగించబడవు. కేవలం కనబడకుండా మాత్రమే చేస్తుంది. ఎప్పుడు అవసరమైనా ఒక చిన్న ఆదేశం ద్వారా కనబడని బొమ్మని కనబడేటట్లు చేయవచ్చు.
  4. సాంస్కృతికంగా తటస్థంగా మరియు అందరిని కలుపుకునేటట్లుగా ఈ సౌలభ్యం వుంటుంది.
  5. అతి తక్కువ ఆశ్చర్యం కలుగచేయటం దీని మూల లక్షణం.

కనీస అశ్చర్యం కలిగించు విధానం అంటే ఏమిటి?[edit]

కనీస అశ్చర్యం కలిగించు విధానం అంటే వాడుకరులు వికీమీడియా సైట్లు వాడుతున్నప్పుడు కనబడే సమాచారం ఆశ్ఛర్యం కలిగించేదిగా వుండకూడదు. సైకిల్ తొక్కటం వ్యాసం చూడటానికి నొక్కినప్పుడు, నగ్నంగా సైకిల్ తొక్కే వారి బొమ్మల కనబడతాయని ఊహించరు. తాళం వ్యాసం చూడటానికిపోతే, ఉదాహరణకు సంభోగాన్ని తాళంగా చూపించే గ్రాఫిక్ చిత్రాలు కనబడకూడదు. బొమ్మ ప్రదర్శన నియంత్రణ ఉపకరణం మీరు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసి ఇటువంటి సందర్భాలను తగ్గిస్తుంది.

ఈ ఉపకరణం పనిచేసే విధానం తెలియచేయండి?[edit]

అనామక వాడుకరులు మరియు ఖాతాలో ప్రవేశించే వాడుకరులు ముందే నిర్ణయించబడిన వర్గాలనుండి కనబడకుండా చేసే వర్గాలను ఎంచుకుంటారు. మొదటి సారి చూసినప్పుడు ఒకటి ఒకటిగా బొమ్మలను కనబడకుండా చేయవచ్చు. ఇవన్నీ తరువాత మార్చుకోవచ్చు. కనబడని బొమ్మలను సాధారణ ఆదేశం ద్వారా చూడవచ్చు.

ఎటువంటి బొమ్మలు కనబడకుండాచేయబడతాయి?[edit]

కనబడకుండా చేయబడే బొమ్మలు వర్గాలలో వుంటాయి. సముదాయం వర్గీకరణ నిర్ణయిస్తుంది మరియు ఎటువంటి బొమ్మలు ఆ వర్గాలలో ప్రవేశపెట్టాలో నిర్ణయిస్తుంది.

బొమ్మ ప్రదర్శన నియంత్రణ సౌలభ్యం నేపథ్యం వివరించండి?[edit]

ట్రస్టీల బోర్డు వివాదాస్పద విషయంతీర్మానం ద్వారా వికీమీడియా ఫౌండేషన్ ను వ్యక్తిగత బొమ్మ ప్రదర్శన నియంత్రణ సౌలభ్యం తయారీ మరియు ఉపయోగించమని కోరింది. వికీమీడియా ప్రాజెక్టులలో ఇష్టంలేని బొమ్మలను మొదటసారి చూచినప్పుడు లేక ఐచ్ఛికాల ద్వారా కనబడకుండా దాచటమే దీని ఉద్దేశం. దీనివలన వాడుకరికి వారి ఇష్టాలకనుగుణంగా వాడుకోగలుగుతారు. దానిని చాలా సాధారణంగా మరియు సులభంగా వాడుకునేటట్లు చేయాలి. సంపాదకులకు కూడా సులభంగా వుండాలి.

ఈ సౌలభ్యం అన్ని వికీమీడియా ప్రాజెక్టులకు వర్తిస్తుంది. ఇది బొమ్మలను తొలగించదు. ఇష్టానుగుణంగా కనబడకుండా మాత్రమే చేస్తుంది. దీనితయారీకి, మేము కొన్ని నియమాలు చేశాము కానివాటికి అవసరానికి తగ్గట్టు తయారీ ప్రక్రియ లో సర్దుబాట్లు జరుగుతాయి. ఈ సర్దుబాట్లు కొరకు, ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మీ ప్రాధాన్యతలను తెలియచేసి సహాయం చేయండి.


చాలాకాలంగా చర్చనీయాంశంగా వున్న విషయాలపై జరిగిన పని వివదాస్పద విషయ నివేదిక పై బోర్డు స్పందనే ఈ తీర్మానం. ఆ నివేదికలో వ్యక్తిగత బొమ్మల ప్రదర్శన నియంత్రణ తయారీ మరియు ప్రయోగం ఉపకరణం నివేదికలోని ప్రతిపాదన. సంపాదకుల అభిప్రాయసేకరణ జరపటం ఫౌండేషన్ నిర్ణయం.

దీనివలన సమాచార నిర్ణయాలపై ప్రభావం వుంటుందా?[edit]

వాటిపై ప్రభావముండదు ఈ ఉపకరణం వికీమీడియా సైట్లపై ఏ విషయం వుంటుందనేది నిర్ణయించదు. వికీమీడియా సముదాయం ప్రస్తుత విధానాలు, సూచనలు అధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత బొమ్మ ప్రదర్శన నియంత్రణ సౌలభ్యం వారి వారి ఇష్టాలకు తగ్గట్టుగా విషయాన్ని ప్రదర్శించేటట్లు చేస్తుంది.

దీనిని ఎందుకు అమలుచేయబోతున్నారు?[edit]

వికీమీడియా ప్రాజెక్టు వాడుకరులకు ఎంపిక అవకాశాలు మెరుగుపరచి తృప్తిని పెంచడానికి దీనిని అమలుచేయబోతున్నాము. దీనివలన వికీమీడియా ప్రాజెక్టులు ఇంకా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వాడబడుతాయి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా దీనివలన ఒక వ్యక్తికి ఇష్టాల ఎంపికలో మార్పులు చేసుకోవచ్చు కాబట్టి చదువరులు వాడకరులకి బాధ్యతాయతమైన సేవలందించటం కుదురుతుంది.

వ్యక్తిగత బొమ్మల ప్రదర్శన నియంత్రణ ఉపకరణం ఒకరకమైన సెన్సార్ లాంటిదా?[edit]

కాదు. కావాలనుకున్నవారు చూచే అనుభవం మాత్రమే దీని ద్వారా మారుతుంది. ఇతర వాడుకరులపై దీని ప్రభావం వుండదు. వికీమీడియా పూర్తి సమాచారం ప్రతి వొక్కరి వాడుకరికి అందుబాటులో వుంటుంది. దీనివలన, వాడేవారితో సహా అందరికి ఏ సమాచారం తొలగించబడదు. ఎంపికైన విషయం తాత్కాలికంగా కనబడకుండా చేస్తుంది.

ఈ అభిప్రాయసేకరణలో మిమ్ములను అడిగే ప్రశ్నల ఎలా వుంటాయి?[edit]

బొమ్మ ప్రదర్శన నియంత్రణ తయారీ తొలిదశలో వుంది. దీనితొలిరూపుకోసం mw:Personal image filter చూడండి. ఇది కొన్ని నియమాలపై ఆధారపడింది. ఇంకా అభివృద్ధిచేసేముందు, మీ అభిప్రాయలద్వారా ఈ నియమాల సాపేక్షప్రాధాన్యాన్ని తెలుసుకొనగోరుచున్నాము. దీనిని ఆధారంగా, సముదాయ భాగస్వామ్యంతో ముందు ముందు అభివృద్ధిపనిజరుగుతుంది.