Privacy policy/Definitions/te

From Meta, a Wikimedia project coordination wiki
Jump to navigation Jump to search
This page is a translated version of the page Privacy policy/Definitions and the translation is 74% complete.

Outdated translations are marked like this.
Other languages:
Avañe'ẽ • ‎Bahasa Melayu • ‎Deutsch • ‎Deutsch (Sie-Form)‎ • ‎English • ‎Esperanto • ‎Nederlands • ‎Scots • ‎Tiếng Việt • ‎Türkçe • ‎bosanski • ‎català • ‎dansk • ‎eesti • ‎español • ‎euskara • ‎français • ‎galego • ‎italiano • ‎magyar • ‎norsk bokmål • ‎occitan • ‎polski • ‎português • ‎português do Brasil • ‎slovenčina • ‎suomi • ‎čeština • ‎Ελληνικά • ‎башҡортса • ‎български • ‎русский • ‎українська • ‎ייִדיש • ‎اردو • ‎العربية • ‎فارسی • ‎مصرى • ‎پښتو • ‎नेपाली • ‎తెలుగు • ‎ไทย • ‎中文 • ‎日本語 • ‎한국어

Want to help translate? Translate the missing messages.

మేం ఇలా అంటే... ...దానర్థం ఇది:
"వికీమీడియా ఫౌండేషన్" / "ఫౌండేషన్" / "మేము" / "మమ్మల్ని" / "మా" ది వికీమీడియా ఫౌండేషన్, ఇంక్., వికీమీడియా సైట్లను నడిపే లాభాపేక్షలేని సంస్థ.
"వికీమీడియా సైట్లు" / "మా సేవలు" వికీమీడియా వెబ్‌సైట్లు, సేవలు (భాషాతీతంగా), వికీపీడియా, వికీమీడియా కామన్స్ వంటి ప్రధాన ప్రాజెక్టులతో సహా, మొబైలు అనువర్తనాలతో సహా, APIలు, ఈమెయిళ్ళు, నోటిఫికేషన్లన్నీ: కింది "ఈ గోప్యతా విధానము పరిధి లోకి రానివి" విభాగంలో చూపించిన సైట్లు, సేవలను మినహాయించి.
"మీరు" / "మీ" / "నేను" మీరు - వ్యక్తి అయినా, సమూహం లేదా సంస్థైనా సరే, వికీమీడియా సైట్లు, సేవలను వాడుతున్నది మీ తరపునైనా, ఇతరుల తరపునైనా సరే.
"ఈ విధానం" / "ఈ గోప్యతా విధానం" "వికీమీడియా ఫౌండేషను గోప్యతా విధానము" అనే ఈ పత్రం.
"తోడ్పాటు" వికీమీడియా సైట్లలో మీరు చేసే మార్పుచేర్పులు, అందించే కంటెంటు.
"వ్యక్తిగత సమాచారం"

మిమ్మల్ని వ్యకిగతంగా గుర్తించగలిగే సమాచారం -మీరు మాకిచ్చేదీ, మేం మీ నుండి సేకరించేదీ. స్పష్టంగా చెప్పాలంటే, కింది సమాచారాలన్నిటినీ మేము సేకరించకపోయినప్పటికీ, వీటిని "వ్యక్తిగత సమాచారం"గా భావిస్తాం -అది బహిరంగ సమాచారం కాకపోతే, దాని సహాయంతో మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించగలిగితే.

(అ) మీ స్వంత పేరు, చిరునామా, ఫోను నంబరు, ఈమెయిలు చిరునామా, సంకేతపదం, ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు నంబరు, ఐపీ చిరునామా, యూజర్-ఏజెంటు సమాచారం, క్రెడిట్ కార్డు నంబరు;

(ఆ) అ విభాగంలోని ఏ అంశంతోనైనా జోడించబడిన సున్నితమైన సమాచారం -పుట్టినరోజు, లింగం, లైంగిక ప్రవృత్తి, జాతి, కుల విషయాలు, వైవాహిక స్థితి, ఆరోగ్య విషయాలు/వైకల్యాలు, రాజకీయ దృక్పథం, మతం; మరియు

"థర్డ్ పార్టీ" / "థర్డ్ పార్టీలు"

వికీమీడియాఅ ఫౌండేషను నియంత్రణలో గాని, నిర్వహణలో గాని, ఆపరేషనులో గానీ లేని వ్యక్తులు, సంస్థలు, వెబ్‌సైట్లు, సేవలు, ఉత్పత్తులు, అనువర్తనాలు. వీటిలో [[m:Wikimedia_chapters|వికీమీడియా చాప్టర్లు], థిమాటిక్ సంస్థలు, వాడుకరి సమూహాలు, స్వచ్ఛంద కార్యకర్తలు, ఉద్యోగులు, డైరెక్టర్లు, ఆఫీసర్లు, గ్రాంట్ల లభ్దిదారులు, వంటి వికీమీడియా ఉద్యమానికి తోడ్పాటు అందించే ఇతర వికీమీడియా వాడుకరులు, స్వతంత్ర సంస్థలు, సమూహాలు మరియు ఆయా సంస్థల కాంట్రాక్టర్లు, సమూహాలు ఉన్నాయి.