విశ్వజనీన ప్రవర్తనా నియమావళి/సవరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాలు/ప్రకటన/సంప్రదింపు ముగిసింది
This page is currently being updated and translated by Wikimedia Foundation staff and contractors. |
Review period on the revised Enforcement Guidelines for the Universal Code of Conduct closed
ప్రియమైన వికిమీడియన్స్,
విశ్వజనీన ప్రవర్తనా నియమావళి (UCoC) కోసం సవరించిన ముసాయిదా మార్గదర్శకాల సమీక్షలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు సమయం వెచ్చించి మార్గదర్శకాల గురించి చర్చించి పేర్లు సూచించి, మరియు ప్రశ్నలు అడిగినందుకు UCoC ప్రాజెక్టు బృందం మరియు UCoC ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాల సవరణ కమిటీ అభినందిస్తోంది.
ఈ కమిటీ సమీక్షా కాల వ్యవధి 8 సెప్టెంబర్ 2022 నుంచి 8 ఆక్టోబర్ 2022 నాటికి ముగిసింది.
గత నాలుగు వారాలలో, UCoC ప్రాజెక్టు బృందం వివిధ మార్గాలలో విలువైన కమ్యూనిటీ ఇన్‌పుట్‌ను సేకరించింది, ఇందులో మూడు సంభాషణా గంటల సెషన్లలో, UCoC ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాల గురించి వికిమీడియన్లు కలిసికట్టుగా చర్చించినవి ఉన్నాయి.
సవరణ కమిటీ తిరిగి అక్టోబర్ 2022లో సమావేశమైనప్పుడు కమ్యూనిటీ ఇన్‌పుట్‌ను సమీక్షిస్తుంది. కమ్యూనిటీ వ్యాప్తంగా 2023 జనవరి మధ్యలో జరిగే ఓటింగ్ కోసం ప్రస్తుతం షెడ్యూల్ చేసిన UCoC ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాల యొక్క అంతిమ వెర్షన్‌ను కమిటి సిద్ధం చేస్తున్నందున UCoC ప్రాజెక్టు బృందం వారి పనిని వారు కొనసాగిస్తున్నందున అప్‌డేట్స్ అందించడంలో మద్దతిస్తుంది మరియు అన్ని ముఖ్యమైన పరిణామాలు మరియు విజయాల గురించి కమ్యూనిటికీ తెలియజేయడం కొనసాగిస్తుంది.
UCoC ప్రాజెక్ట్ బృందం తరుపున