Jump to content

User:Chaduvari/Vital Knowledge Drive 2025-te

From Meta, a Wikimedia project coordination wiki

Event: ఆవశ్యక విజ్ఞాన ఉద్యమం 2025

[edit]
2026 మార్చి 23 నుండి ఏప్రిల్ 13 వరకు జరిగే ఈ ఉద్యమంలో చేరి, తెలుగు భాషా వికీపీడియాలో 1000 ఆవశ్యక వ్యాసాలను విస్తరించడంలో తోడ్పడండి! అగ్రభాగాన నిలిచిన వాడుకరులను డిఫ్ బ్లాగులో ప్రదర్శిస్తాం. ఈ వారం కార్యకలాపాలను చూడండి.

అవలోకనం

[edit]

ఆవశ్యక విజ్ఞానం అనేది, వికీపీడియా ప్రాజెక్టును వాడుకునేందుకు అవసరమైన విస్తృతినీ, లోతునూ అందించే వ్యాసాల కోశం. విషయ ప్రాముఖ్యత పైన, ప్రాసంగికత పైన, పాఠకలోకం, వ్యాసాల మధ్య సంబంధాల పైనా ఆధారపడి, సముదాయాలు ఆవశ్యకతను నిర్వచిస్తాయి. మెరుగుపరచాలని ఆయా భాషా సముదాయాలు ఎంపిక చేసి పెట్టుకున్న వ్యాసాలివి. ఆ విధంగా ఇంగ్లీషు వికీపీడియా ఎంచిపెట్టుకున్న ఆవశ్యక వ్యాసాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

మీలాంటి వ్యక్తులు తోడ్పడితేనే వికీపీడియా ముందుకు పోతుంది. గూగుల్ లాంటి సెర్చి ఇంజన్లలో వెతకడం తేలిక కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులు చాలామంది ఇంగ్లీషు వికీపీడియాను వాడుతున్నప్పటికీ, చాలా సందర్భాల్లో తెలుగు వికీపీడియాలోనే మరింత సందర్భోచితమైన సమాచారం లభిస్తుంది. కానీ, మీలాంటి వ్యక్తులు కంటెంటును సృష్టిస్తేనే తెలుగు వికీపీడియా మనగలుగుతుంది! మరీ ముఖ్యంగా, కృత్రిమ మేధ వంటి సాఫ్ట్‌వేర్లు అంతర్జాలంలో ఎడాపెడా అనువాదాలు చేసేస్తున్న ప్రస్తుత సందర్భంలో వికీపీడియా లాంటి వెబ్‌సైట్లలో స్థానిక భాషలో సమాచారం ఉంటే మన భాషలనూ, సంస్కృతులనూ రక్షించుకోడానికి పనికొస్తుంది.

3-వారాల వ్యవస్థీకృత కార్యక్రమంలో చేరండి. వికీపీడియాలో ఎలా రాయాలో అంచెలంచెలుగా ఇది మార్గదర్శకత్వం చేస్తుంది. ఇందులో కింది అంశాలుంటాయి:

  • వారం వారీ కార్యక్రమాలను ఈ వికీ పేజీలో ప్రచురిస్తాం. ఒక్కో పనికీ వారానికి 2-5 గంటలు పడుతుంది.
  • ఈ ప్రాసెస్ పొడుగూతా తోడ్పాటు, మార్గదర్శకత్వం ఉంటుంది.
  • వికీపీడియా బ్లాగ్ పోస్టు ద్వారా అగ్రశ్రేణిలో ఉన్న వాడుకరులకు గుర్తింపు ఉంటుంది.
  • నమోదైన వాడుకరులకు వారం వారం ఈమెయిళ్ళు, రిమైండర్లు పంపిస్తాం.

వారం 1 - మార్చి 23: వికీపీడియా ప్రాథమిక అంశాలను నేర్చుకోండి

[edit]
బొమ్మ 1: వికీపీడియా 5 మూలస్థంభాల ఇన్ఫోగ్రాఫిక్

ఇక్కడ మొదలుపెట్టండి: అభ్యసన లక్ష్యం

ఈ వారం మీరు వికీపీడియాలో దిద్దుబాట్లు చెయ్యడంలో, అత్మవిశ్వాసంతో తొలి అడుగులు వేస్తారు. వికీపీడియా 5 మూలస్తంభాల గురించి తెలుసుకుంటారు, మీ స్వంత ఖాతాను తెరుస్తారు, విజువల్ ఎడిటరు వాడి ఏదైనా ఆవశ్యక వ్యాసంలో తేలికైన దిద్దుబాటు ఒకటి చేస్తారు.

కార్యకలాపాలు

  • వికీపీడియాలో అత్యుత్తమ పద్ధతులను తెలుసుకోండి - వికీపీడియా 5 మూలస్తంభాలతో మొదలుపెట్టండి. బొమ్మ 1 చూడండి.
  • ఈ వికీలో మీకు ఖాతా లేనట్లైతే, ఓ ఖాతా సృష్టించుకోండి.
  • కింద ఉన్న ఆవశ్యక వ్యాసాల జాబితా లోంచి ఒక వ్యాసాన్ని ఎంచుకుని, విజువల్ ఎడిటరు పరికరాన్ని వాడి తేలికైన ఒక చిన్న దిద్దుబాటు చెయ్యండి. చిన్నపాటి దిద్దుబాట్లకు ఉదాహరణలు:
    • వ్యాకరణ, అక్షర దోషాలను సరిచెయ్యడం.
    • సమాచారంలో దోషాలుంటే వాటిని సవరించడం, సరైన మూలాలను చేర్చడం
    • వికీ సింటాక్సు లోపాలను సవరించడం (ఉదా., ఆకృతి, శీర్షికలు, మూసలు)
    • తెగిపోయిన లింకులను, ఎర్రలింకులనూ బాగుచెయ్యడం
      వీడియో 1: విజువల్ ఎడిటరు వాడి తెగిపోయిన లింకులను సరిచెయ్యడం లాంటి చిన్నచిన్న దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో చూపే ప్రదర్శన.
  • "మార్పులను ప్రచురించు" నొక్కేముందు, మీరు చేసిన దిద్దుబాటుకు ఒక చిన్నపాటి దిద్దుబాటు సారాంశాన్ని చేర్చండి. ఈ పేజీని గమనించేవారికి మీరు చేసిన పని ఏంటో ఇది చూస్తే అర్థమౌతుంది. వీడియో 1 చూడండి.
  • (ఐచ్ఛికం) ఈ కొత్త కోర్సులో చేరి (ఇది ఇంగ్లీషులో మాత్రమే ఉంది), ఓ ~3-గంటల వీడియో చూసి మూల సూత్రాలు, కంటెంటు విధానాల గురించి తెలుసుకోండి. వీడియో 2 చూడండి.

ముగింపు: ముందుకు పోయే ముందు, మీరు ఏమేం నేర్చుకున్నారో ఒకసారి చూసుకోండి

  • వికీపీడియా ఐదు మూలస్తంభాల గురించి చదివారా?
  • ఖాతా తెరిచారా, లాగినయ్యారా?
  • ఓ చిన్న దిద్దుబాటు చేసి, దిద్దుబాటు సారాంశం రాసారా?

ఇవన్నీ చేస్తే, మీరిక రెండో వారానికి సిద్ధంగా ఉన్నట్లే!

(ఐచ్ఛికం) వీడియో 2: వికీమీడియా ప్రధాన కరిక్యులం సమర్పించే వికీపీడియా మూల సూత్రాలు, కంటెంటు విధానాలు

మీ స్వయం పరిశీలన కోసం:

అత్యుత్తమ పద్ధతుల్లో ఏది మీకు బాగా ఆసక్తి కలిగించింది లేదా కొత్తగా అనిపించింది? విజువల్ ఎడిటరు వాడి మీరు ఏయే మార్పులు చేసారు, ఆ మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉందని మీరు ఎలా గ్రహించారు?

మీరు పని చేసిన వ్యాసాలేంటో, ఇంకా ఏ వ్యాసాలను మెరుగుపరచాలని అనుకుంటున్నారో చెప్పండి. మీ ఆలోచనలను [ఈ ఈవెంటు చర్చ పేజీలో] రాయండి.

ఆవశ్యక వ్యాసాల జాబితా

వారం 2 - మార్చి 30: అనువాద పరికరాలు వాడి వ్యాసాల్లోని విభాగాలను మెరుగుపరచండి

[edit]

ఇక్కడ మొదలుపెట్టండి: అభ్యసన లక్ష్యం

వీడియో 3: విభాగాల అనువాద పరికరం వాడి విభాగాలను విస్తరించడం ఎలాగో ప్రదర్శించడం

ఈ వారం మీరు, విభాగాల అనువాద పరికరం వాడి విభాగాలను విస్తరించడం ఎలాగో నేర్చుకుంటారు. అనువాదం కోసం సరైన భాషాజంటలను ఎంచుకోవడం, యాంత్రిక అనువాదాన్ని సృష్టించడం, అవసరమైన సవరణలు చేసి, దాన్ని మెరుగుపరచడం వగైరాలను అభ్యాసం చేస్తారు.

కార్యకలాపాలు

  • చిన్న చిన్న విభాగాలను అనువదించి, అనువాద పరికరాన్ని పరిశీలించండి. తేలిగ్గా, సులువుగా అనువదించగల విభాగాలతో మొదలుపెట్టండి. వీడియో 3 చూడండి.
  • కింది ఆవశ్యక వ్యాసాల జాబితా నుండి ఓ వ్యాసాన్ని ఎంచుకోండి. ఇందులోని ప్రతీ శీర్షిక నుండి నేరుగా విభాగ అనువాద పరికరానికి లింకు ఇచ్చాం.
  • భాషల జంట మీ నైపుణ్యాలకు అనుగుణంగా ఉందని నిర్థారించుకోండి (ఉదా., ఇంగ్లీషు → తెలుగు). మూలం ఎడమ వైపున కనిపిస్తుంది. కుడివైపున ఉన్న పెట్టెలో నొక్కి, యాంత్రిక అనువాదాన్ని సృష్టించవచ్చు.
  • అనువాదం చేసేందుకు MinT ను గానీ, Google అనువాద పరికరాన్ని గానీ ఎంచుకోవచ్చు. అత్యంత కచ్చితంగా ఏది అనువదిస్తుందో దాన్నే ఎంచుకోండి.
    వీడియో 4: చరిత్ర పేజీలో - దిద్దుబాటును వెనక్కి తిప్పడం, దిద్దుబాట్ల తేడాలను చూడడం, వాడుకరులకు ధన్యవాదాలు చెప్పడం చూడవచ్చు.
  • ప్రచురించే ముందు, యాంత్రిక అనువాదాన్ని మెరుగు పరచండి: ప్రతీ పేరా కచ్చితంగా, స్పష్టంగా, తటస్థంగా ఉండేలా చూడండి. ప్రచురించే ముందు, మానవిక అనువాదం కనీసం 25% వరకు ఉండాలి.
  • పనికొచ్చే కొన్ని చిట్కాల కోసం పరికరానికి కుడివైపున ఇచ్చిన అనువాద మార్గదర్శకాలను చూడండి.
  • మీరు దిద్దుబాటు చేసాక జరిగిన ఇతర దిద్దుబాట్ల కోసమూ, మీరు చేసిన దిద్దుబాట్లపై ఫీడ్‌బ్యాక్ కోసమూ వ్యాసపు చర్చ పేజీ చూసి, అవసరమైన మార్పుచేర్పులు చెయ్యండి. వీడియో 4 చూడండి.
  • చిన్న విభాగాలతో అనుభవం వచ్చాక, ఆవశ్యక వ్యాసాల్లో పెద్ద విభాగాలపై ఇదే పద్ధతిలో పనిచెయ్యండి.

ముగింపు: ముందుకు పోయే ముందు ఏమేం నేర్చుకున్నారో ఒకసారి చూసుకోండి

  • విభాగ అనువాద పరికరం వాడి కనీసం ఒక్క విభాగాన్నైనా అనువదించారా?
  • భాషల జంట సరైనదేనని నిర్థారించుకున్నారా? ప్రచురించే ముందు యాంత్రికానువాదాన్ని మెరుగు పరచారా?
  • వ్యాసపు చరిత్ర పేజీలో మీ చేర్పులను చూసి, వాటిపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించారా?

ఇవన్నీ చేస్తే, మీరిక మూడో వారానికి సిద్ధంగా ఉన్నట్లే!

మీ స్వయం పరిశీలన కోసం:

ఈ వారం విభాగ అనువాద పరికరం వాడేటపుడు మీరు నేర్చుకున్న చిట్కా గానీ, బాగా పనికొచ్చే నైపుణ్యం గానీ ఏమిటి? దాన్నీ, విజువల్ ఎడిటరునూ వాడడంలో ఉన్న సారూప్యతలేమిటి? యాంత్రికానువాదం నాణ్యత ఎలా ఉంది? మీ భాషల జంటను అనువదించడంలో MinT, Google Translate లలో ఏది మంచి ఫలితాలను ఇచ్చింది?

మీరు అనువదించిన వ్యాసాలకు లింకులు ఇవ్వండి. మీ ఆలోచనలను [ఈ ఈవెంటు చర్చ పేజీలో] రాయండి.

ఆవశ్యక వ్యాసాల జాబితా

వారం 3 – ఏప్రిల్ 6: అనువాద పరికరాలను వాడి కొత్తగా వ్యాసాలను సృష్టించండి

[edit]

ఇక్కడ మొదలుపెట్టండి: అభ్యసన లక్ష్యం

ఈ వారం, విషయ అనువాద పరికరం వాడి, వేరే భాష లోని వికీపీడియా నుండి ఓ వ్యాసాన్ని తెలుగు వికీపీడియాలోకి పూర్తిగా అనువదించి, ఓ కొత్త వ్యాసాన్ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటారు. గత రెండు వారాల్లో నేర్చుకున్న నైపుణ్యాల ఆధారంగా విభాగాల స్థాయి నుండి ఒక సంపూర్ణమైన వ్యాసాన్ని సృష్టించే స్థాయికి వెళ్తారు.

  • గత వారాల్లో మీరు, కొన్ని నిర్దుష్టమైన విభాగాలను మాత్రమే అనువదించారు. ఈసారి, తెలుగులో లేని ఒక కొత్త వ్యాసాన్ని అనువదించి సృష్టిస్తారు.
  • విషయ అనువాద పరికరం వాడి (విభాగ అనువాద పరికరానికి ఇది మాతృక) మరో భాష నుండి ఓ కొత్త వ్యాసాన్ని సృష్టించండి.
  • కింది ఆవశ్యక వ్యాసాల జాబితా నుండి ఒక వ్యాసాన్ని ఎంచుకోండి. ఇందులోని ప్రతీ వ్యాసం నుండి నేరుగా విషయ అనువాద పరికరానికి లింకు వెళ్తుంది.
  • గత వారంలో అనుసరించిన పద్ధతులనే అనుసరించండి:
    • భాషల జంటను నిర్థారించుకోండి
    • యాంత్రికానువాదాన్ని సృష్టించండి (MinT గానీ Google Translate గానీ వాడి)
    • ప్రచురించే ముందు మానవికంగా దిద్దుబాట్లు చేసి, అనువాదంలో కచ్చితత్వాన్నీ, స్పష్టతనూ, తటస్థతనూ మెరుగుపరచండి.
  • సహాయం కోసం అనువాద మార్గదర్శకాలను చూడండి.
  • ప్రచురించాక, వ్యాసపు చరిత్ర చూసి, ఆ తరువాత జరిగిన దిద్దుబాట్లను గానీ, వచ్చిన ఫీడ్‌బ్యాకును గానీ పరిశీలించి, దాని ప్రకారం దిద్దుబాట్లు ఏమైనా చెయ్యాల్సి ఉంటే, చేసెయ్యండి.

ముగింపు: ముందుకు పోయే ముందు ఏమేం నేర్చుకున్నారో ఒకసారి చూసుకోండి

  • విషయ అనువాద పరికరం వాడి ఒక సంపూర్ణమైన వ్యాసాన్ని సృష్టించారా?
  • ప్రచురించే ముందు యాంత్రికానువాదాన్ని బాగా మెరుగుపరచారా?
  • వ్యాసపు చరిత్ర చూసి, ఏమైనా దిద్దుబాట్లు గానీ ఫీడ్‌బ్యాకు గానీ వచ్చాయేమో చూసారా?

అభినందనలు! ఈ సీరీస్‌ను పూర్తిచేసి, మీ వికీపీడియాకు ఒక వ్యాసం సమర్పించారు.

మీ స్వయం పరిశీలన కోసం:

పూర్తి వ్యాసాన్ని అనువదించడం లోను, ఓ విభాగాన్ని మాత్రమే అనువదించడం లోనూ ఉన్న వ్యత్యాసాల గురించి మీ ఆలోచనలు ఏంటి? వర్క్‌లోడ్‌, కచ్చితత్వం, అనువాద నాణ్యతలలో మీరు గమనించిన తేడాలేమిటి?

ఈ ఈవెంటు చర్చ పేజీలో మీరు సృష్టించిన వ్యాసానికి లింకు ఇచ్చి, మీ ఆలోచనలు రాయండి.

ఆవశ్యక వ్యాసాల జాబితా

మీ తోడ్పాటుకు ధన్యవాదాలు!

[edit]

తెలుగు భాషా వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేందుకు చేసే ప్రతీ చిన్న ప్రయత్నమూ మా సముదాయం వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది! వికీపీడియా ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకుంటే, మీ భాషను కాపాడుకోవడం లోనూ ఆన్‌లైనులో వ్యాప్తి చేయడం లోనూ మీరు చురుగ్గా పాల్గొనే వీలు కలుగుతుంది.

మా తెలుగు వికీపీడియా సముదాయం గురించి మరింత తెలుసుకోవాలని ఉంటే, వికీపీడియా గురించి పేజీని చూడవచ్చు, లేదా మీ ప్రశ్నలను మా రచ్చబండ లో రాయవచ్చు.