వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Wikimedia Foundation Board of Trustees/Overview and the translation is 94% complete.
Outdated translations are marked like this.

వికీమీడియా ఫౌండేషన్
బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్


మీకు తెలుసా? మీరు మీకు ఇష్టమైన వికీపీడియా వ్యాసం చదువుతున్నపుడు, దాని వెనుక వేల మంది వాలంటీర్లు కృషి ఉంటది.

దీని వెనుక ఒక అద్భుతమైన కమ్యూనిటీ, సమర్చరాన్ని ఉంచితంగా అందించేందుకు కృషి చేస్తూ ఉంది. వీరంతా కలిసి వికీపీడియా, వికీడేటా, వికిసోర్స్ వంటి వివిధ ప్రోజెక్టుల మీద పని చేస్తుంటారు.

వికీమీడియా ఫౌండేషన్ లాభాపేక్షలేని సంస్థ, ఇది వివిధ వికీమీడియా ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది. సాంకేతిక సహకారాన్ని, వాలింటీర్లను, అనుబంధ సంస్థలకు వనరులు అందించడం ద్వారా వికీమీడియా ప్రాజెక్టుల వృద్ధికి వికీమీడియా ఫౌండేషన్ వారు మద్దతును ఇస్తారు.

వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. ఫౌండేషన్ యొక్క వార్షిక ప్రణాళికను కూడా బోర్డు పర్యవేక్షిస్తుంది, ఇది ఒక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టులు, ప్రాంతాలు, సముదాయాలకు ఫౌండేషన్ మద్దతును నిర్ణయించటంలో ఈ ట్రస్టీ చాలా కీలకంగా ఉంటుంది.

బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లో 16 మంది ఉంటారు:
సముదాయ ఎన్నికల ప్రక్రియ ద్వారా 8 స్థానాలను ఎన్నుకుంటారు,
ఏడుగురిని అవసరమైన నైపుణ్యం కోసం ట్రస్టీలు నియమిస్తారు,
ఒకరు వికీపీడియా వ్యవస్థాపకుడు

ప్రతి ట్రస్టీ మూడేళ్ల కాలపరిమితితో పనిచేస్తారు.


నైపుణ్యం కోసం నియమించే ట్రస్టీలను, ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉన్నవారిని నియమిస్తారు.

ఎనిమిది స్థానాలను వికీమీడియా సముదాయ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు.


ప్రతి ట్రస్టీ ఒక సంవత్సరములో 150 గంటలు సమయాన్ని బోర్డు పనులు కోసం కేటాయిస్తారు. ట్రస్టీలు వివిధ బోర్డు సమితిలలో పాల్గొంటారు. ఈ సమితిలలో బోర్డు పాలన, ఆడిట్, మానవ వనరులు, ఉత్పత్తి, ప్రత్యేక ప్రాజెక్టులు మరియు సమాజ వ్యవహారాలు ఉన్నాయి.
బహిరంగంగా లభించే సమావేశ నిర్ణయ వివరాలు ఫౌండేషన్ వికీ యొక్క సమావేశాల పేజీలో లేదా సమితిలల పేజీలలో పోస్ట్ చేయబడతాయి.
బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి మరియు బోర్డు ఎన్నికలలో మీరు ఎలా పాల్గొనవచ్చో కూడా ఈ లింకులో తెలుసుకోండి.