File:Yerukala lifestyle .jpg

From Meta, a Wikimedia project coordination wiki

Original file(1,737 × 1,433 pixels, file size: 892 KB, MIME type: image/jpeg)

This is a file from the Wikimedia Commons. The description on its description page there is copied below.

Summary

Description

ఎరుకలు-జీవన విధానం:

ఎరుకల గిరిజనులను మహారాష్ట్రలోని కైకాడీ,కర్ణాటక కొరమరా,తమిళనాడులో కొరద-కొరచ,పాండిచ్చేరిలో నిద్దనారు, మధ్యప్రదేశ్ లో కుర్రు అని పేర్కొంటారు.


ఉపతెగ వర్గీకరణ:

వృత్తి ఆధారంగా ఎరుకలలో ఉపతెగ వర్గీకరణ జరిగింది.అవి కుంచె ఎరుకల, ఈతపుల్లల ఎరుకల, దబ్బ ఎరుకల, నార ఎరుకల, ఉప్పు ఎరుకల, జేరగాండ్రు ఎరుకల, పరికి ముక్కల ఎరుకల మెుదలైనవి.


పూజించే దేవతలు:

వీరు ఎల్లమ్మ, పోచమ్మ,మైసమ్మ, ఉప్పలమ్మ,సమ్మక్క-సారలమ్మ,కొంరెల్లి మల్లన్న,కట్ట మల్లన్న, ఐలోని మల్లన్న దేవతలను పూజిస్తారు.

జీవితచక్ర సంబంధాలు:

ప్రసవము ఇంటిదగ్గర మంత్రసాని సహాయంతో జరుపుతారు.ప్రసవ సమయాన్ని శుభకార్యంగా భావిస్తారు. శిశువులకు స్నానం చేయించడానికి మూరెడులోతు గుంతను తవ్వుతారు.దీన్నే కొల్లు అని అంటారు.శిశువుకు 21 రోజు వచ్చేవరకూ ఇక్కడే స్నానం చేయిస్తారు.21 రోజులు దాటిన తర్వాత కొల్లుగుంటను పూడ్చివేసి,చీరతో ఉయ్యాలను చేసి,ఆ ఉయ్యాలలో శిశువును వేసే ఆ రోజే నామకరణం చేస్తారు.బాలింత స్త్రీ తన ఇంటిపైన బియ్యం గింజలు వేస్తే ఎలుకలు రావనే నమ్మకంతో బాలింతలు తమ ఇంటిపైన బియ్యం గింజలు చల్లమని కోరుతారు.అలాగే వెల్లుల్లి లేదా ఉల్లిపాయ బాలింత చేతిలో పెడతారు.శిశువుకు పుట్టిన 11 రోజులలోపే బొడ్డుచుట్టూ నాలుగు వాతలు పెడతారు.తమ ఇష్ట దైవం దగ్గర పుట్టువెంట్రుకలు తీస్తారు.

వృత్తులు:

1.బుట్టలు అల్లడం. 2.పాలగంప అల్లడం 3.కలగూర గంపలు అల్లడం. 4.పెండ తట్టలు. 5.బావులు పూడిక తీయడానికి ఉపయెూగించే గంపలు. 6.కోళ్ళ గూడు. 7.గుమ్మీల తయారీ. 8.తడకలు చేయడం. 9.చాటలు తయారుచేయడం. 10.సోది చెప్పటం (ఎరుకల సాని)

తయారీ విధానం:

గంపలు అల్లడానికి ఈతకట్టెను ఉపయెూగిస్తారు ఈతకట్టెల కోసం ఈత వనాలకు వెళ్ళి ఈతకట్టెను తెచ్చి పచ్చి బరిగెను చీల్చి ఎండబెడతారు.ఎండిన ఈత బరిగెను ఎన దెబ్బ,వరదెబ్బ,ఈనె వరదెబ్బ గా చీలుస్తారు.ఈనె వరదెబ్బలను గంప క్రింది భాగం చేయడానికి వాడుతారు. మిగిలిన వాటిని గంప ప్రక్క భాగాలను చేయడానికి వాడుతారు.


వృత్తి పరికరాలు:

ఈతబరిగె కోయడానికి మరియు చీరడానికి,కొడవలిని వాడుతారు.పందులను పట్టడానికి వల మరియు దీని ఉచ్చును చంపడానికి ఇనుముతో తయారైన పదునైన సిల్లాను వినియోగస్తారు.ఇది పొడుగాటి కర్రకు బిగించి ఉంటుంది.జంతువులను పక్షులను పట్టడానికి బోనును వినియెూగిస్తారు. పక్షులను చంపడానికి ఉండీలు,శికారు కుక్కలను పెంచుతారు.
Date 30 November 2017 (according to Exif data)
Source Own work
Author Adbh266

Licensing

I, the copyright holder of this work, hereby publish it under the following license:
w:en:Creative Commons
attribution share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
You are free:
  • to share – to copy, distribute and transmit the work
  • to remix – to adapt the work
Under the following conditions:
  • attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
  • share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

depicts

30 November 2017

File history

Click on a date/time to view the file as it appeared at that time.

Date/TimeThumbnailDimensionsUserComment
current14:54, 30 November 2017Thumbnail for version as of 14:54, 30 November 20171,737 × 1,433 (892 KB)Adbh266Uploaded using Android Commons app

Global file usage