మూవ్‌మెంట్‌ ఛార్టర్/ముసాయిదా కమిటీ/ఏర్పాటు చేసే ప్రక్రియ

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Movement Charter/Drafting Committee/Set Up Process and the translation is 97% complete.

""మూవ్‌మెంట్‌ ఛార్టర్ ముసాయిదా కమిటీ"" 15 మంది ప్రజలతో ప్రారంభమవుతుంది ఆశిస్తున్నారు.

ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 14, 2021 వరకు ఒక కాల్‌ఇవ్వడం జరిగింది. వికిమీడియా ఫౌండేషన్ మరియు అనుబంధాల నుంచి వేతన సిబ్బందితో పాటుగా వికి ప్రాజెక్టులు మరియు అనుబంధాలలోని స్వచ్ఛంద సేవకులకు బహిరంగ పిలుపు.

Movement Charter/Drafting Committee/Candidates#Candidatesమెటాలో బహిరంగంగా ఉంచబడింది. వైవిధ్యం మరియు నైపుణ్య మాత్రికలు డ్రాఫ్టింగ్‌ కమిటీ యొక్క అభిలషణీయ గుణాల గురించి భాగస్వాములకు తెలియపరుస్తుంది.

కమిటినీ ఏర్పాటు చేయడానికి నాలుగు దశల ప్రక్రియ ఉంటుంది:

  1. అభ్యర్థుల సమూహాన్ని సృష్టించడానికి నామినేషన్‌ ప్రక్రియ.
  2. కమిటీలో 7గురు సభ్యులను ఎన్నుకోవడానికి ప్రాజెక్ట్‌ కమిటీల కోసం ఎన్నికల ప్రక్రియ.
  3. కమిటీలో 6గురు సభ్యులను ఎంపిక చేయడానికి అనుబంధాలను ఎంపిక చేసే ప్రక్రియ.
  4. కమిటీలో 2 సభ్యులను నియమించడానికి వికిమీడియా ఫౌండేషన్‌ ప్రక్రియ.

కాల క్రమం

  • జూలై - ఆగస్ట్ 1, 2021 - సన్నాహాలు
  • ఆగస్ట్ 2 - సెప్టెంబర్ 14, 2021 - నామినేషన్లు
  • సెప్టెంబర్ 15 - అక్టోబర్ 10, 2021 - ఎన్నిక మరియు ఎంపిక ఏర్పాటు
  • అక్టోబర్ 11 - 24, 2021 - కమ్యూనిటీ ఎన్నికలు
  • అక్టోబర్ 11 - 24, 2021 - అనుబంధ ఎంపిక
  • అక్టోబర్ 25 - 31, 2021 - డబ్ల్యూఎమ్ఎఫ్ (వికీ మీడియా ఫౌండేషన్) నియామకం
  • అక్టోబర్ 31, 2021 నాటికి - కమిటీ ప్రకటన

నామినేషన్ ప్రక్రియ

  • అభ్యర్థుల కోసం పిలుపు ఆగస్ట్ 2వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ 2021 నుంచి ఇవ్వడం జరుగుతుంది.
    • ఈ పిలుపు అన్నది వికిమీడియా ఫౌండేషన్ మరియు అనుబంధాల వేతన సిబ్బందికి అదే విధంగా అనుబంధాలు మరియు వికి ప్రాజెక్టుల స్వచ్ఛంద సేవకులకు బహిరంగంగా ఉంటుంది.
    • వైవిధ్యం మరియు నైపుణ్య మాత్రికలు ముసాయిదా కమిటీ యొక్క ఆశించే గుణాల గురించి భాగస్వామ్యులకు తెలియపరుస్తుంది.
  • అందరి అభ్యర్థుల జాబితా మెటాలో బహిరంగంగా ఉంటుంది.
    • అభ్యర్థులు యూజర్‌ ఖాతాలో లాగిన్‌ అయి అభ్యర్థిత్వ నమూనాను వారికివారుగా భర్తీ చేసుకొని బహిరంగంగా నామినేట్ చేసుకుంటారు.
    • అభ్యర్థులు నామినేషన్ నమూనాను పూర్తిగా భర్తీ చేయాలని ఆశించడమైనది.
    • ఈ నమూనాను ఏ భాషలోనైనా భర్తీ చేయవచ్చు. అభ్యర్థి ప్రకటనను అనేక భాషల్లో అనువాదం చేయబడుతుంది మరియు ఈ క్రమంలో ఇంగ్లీష్ అనువాదం కూడా అందించబడుతుంది.
  • అనుబంధంతో నిమిత్తం లేకుండా ఒకే ఒక అభ్యర్థుల సమూహం ఉంటుంది.
    • ఈ సాధారణ అభ్యర్థుల సమూహం నుంచి అన్ని కమిటీల సభ్యులు ఎన్నుకోబడతారు, ఎంపిక కాబడతారు లేదా నియమించబడతారు.
  • అభ్యర్థుల కోసం అర్హత తనిఖీ ఉంటుంది.
    • అభ్యర్థులు ఏదేని వికిమీడియా ప్రాజెక్ట్‌కు మంజూరు కాబడి ఉండరాదు లేదా ఏ ఘటనలోనూ నిషేధించబడి ఉండరాదు. ఎడిట్‌ల సంఖ్యకు సంబంధించి ఎలాంటి అర్హతా ప్రమాణాలు లేవు.
    • వారు నియమించబడడంతో ఫౌండేషన్‌లో గుర్తింపబడిన వారుగా ఉంటారు.
  • అభ్యర్థులు అనుబంధ ఎంపిక ప్రక్రియలో ఎంపికదారులుగా ఉండజాలరు.

ఎన్నికల ప్రక్రియ

ముసాయిదా కమిటీ ఏర్పాటులో ఆన్‌లైన్ ప్రాజెక్ట్ కమ్యూనిటీల భాగస్వామ్యంతో ఎన్నికల ప్రక్రియ రూపొందించబడింది.

  • ఓటింగ్‌ అర్హతకి యూజర్‌కి తప్పనిసరిగా ఉండాల్సినవి:
    • ఒక ప్రాజెక్ట్‌ కన్నా ఎక్కువ వాటిలో నిషేధించబడి ఉండరాదు;
    • మరియు బోట్‌ అయి ఉండరాదు;
    • వికిమీడియా వికిస్‌ వ్యాప్తంగా 12 సెప్టెంబర్ 2021కి ముందు కనీసం 300 ఎడిట్స్‌ చేసి ఉండాలి;
    • మరియు 12 మార్చి 2021 మరియు 12 సెప్టెంబర్ 2021 మధ్య కనీసం 20 ఎడిట్స్‌ చేసి ఉండాలి.
  • అనుబంధాలు మరియు ఫౌండేషన్‌ వారి సొంత సంబంధిత ప్రక్రియలను కలిగి ఉంటాయి మరియు
    • అనుబంధ సిబ్బంది మరియు స్వచ్ఛంద నిర్వాహకులు ఓటు వేయడానికి అర్హలు కాదు.
    • ఫౌండేషన్ సిబ్బంది ఓటు వేయడానికి అర్హులు కారు;
    • (ఏదిఏమైనా, సాధారణ యూజర్‌లలాగా వ్యక్తిగత సిబ్బంది సభ్యులు ఓటు వేయడానికి అర్హులుగా ఉంటారు).
  • సెక్యూర్‌పోల్‌ను ఉపయోగించి ఓటింగ్‌ నిర్వహించబడుతుంది.
    • ఎన్నికలను వికిమీడియా ఫౌండేషన్ యొక్క పాలనా బృందం మరియు ఉద్యమ వ్యూహం చేత ఏర్పాటు చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది.
    • ఎన్నికల ప్రక్రియకి నియమిత తనిఖీదారులు ఉండకపోయినా, పారదర్శకత కోసం ఏరోజుకారోజు సమాచారం ప్రచురించబడుతుంది.
  • ఎన్నికల ఏక బదిలీ చేయగల ఓటు పద్ధతిని ఉపయోగిస్తుంది.
    • ఒక వికి ప్రాజెక్ట్‌కు 2 ఎన్నికైన సభ్యులను మించని షరతుతో ముసాయిదా కమిటీలో భాగంగా టాప్‌ 7 అభ్యర్థులు నియమించబడతారు.
    • 8వ మరియు 9వ అభ్యర్థి ప్రత్యామ్నాయం అవసరమైతే పని చేయడానికి జాబితాలో తోడ్పాటుగా ఉంటారు.
  • ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24, 2021 వరకు కొనసాగుతుంది (AoE).
  • ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 31, 2021 చివరి నాటికి ప్రకటిస్తారు.

ఎంపిక ప్రక్రియ

ముసాయిదా కమిటీ ఏర్పాటులో అనుబంధాలను భాగస్వామ్యం చేసే విధంగా ఎంపిక ప్రక్రియ రూపొందించబడింది.

  • ఈ ప్ర్రక్రియను నిర్వహించడం కోసం, అనుబంధాల చేత ఏర్పడిన ఒక ఎంపిక కమిటీ దాని స్థానంలో ఏర్పాటు అవుతుంది.
  • ప్రాంతీయ దృక్పథం ఆధారంగా ఎంపిక కమిటీ రూపొందించబడుతుంది.
  • ప్రతిపాదిత ప్రాంతాల పంపిణీ, ఉనికిలో ఉన్న సహభాగితాల ఆధారంగా ఉంటుంది:
    • కేంద్ర మరియు తూర్పు యూరోప్, మరియు సెంట్రల్‌ ఆసియా
    • సబ్‌-సహారన్ ఆఫ్రికా
    • మిడిల్‌ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా మరియు కరేబియన్
    • దక్షిణాసియా
    • పశ్చిమ మరియు ఉత్తర యూరోప్
    • ప్రాంతీయ భాగస్వామ్యాలు లేకుండా ప్రాతిపదిక పూర్వక సంస్థలు
  • 9 మంది సభ్యుల ఎంపిక కమిటీని రూపొందించడానికి ఒక పారదర్శక అనుబంధ ఎంపిక ప్రక్రియకి ప్రతి ప్రాంతం ఒక ఎంపికదారుని నియమిస్తుంది.
    • ప్రతి ప్రాంతం తాము కోరుకున్న ఎంపిక పద్దతిని నిర్ణయిస్తుంది.
    • ఎంపికదారులు నియమించబడాలి మరియు కమిటీని అక్టోబర్ 10, 2021 నాటికి రూపొందించాలి.
  • ఎన్నికల ప్రక్రియకు సమాంతరంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది మరియు వైవిధ్యం మరియు నైపుణ్య మాత్రికలు ఆధారంగా ముసాయిదా కమిటీకి వైవిధ్యమైన నైపుణ్యమైన ప్రొఫైల్స్‌ను జోడించడంలో దృష్టి సారించాలి.
    • ప్రతి ఎంపికదారు వారి ప్రాధాన్యతల జాబితాను సృష్టించాలి.
    • బృందం వ్యాప్తంగా ఎంపికను ఖరారు పర్చడానికి మరియు ప్రాధాన్యతలను చర్చించడానికి ఒక సమావేశం ఉంటుంది.
    • ఎంపిక అన్నది అక్టోబర్ 11 -24, 2021 మధ్య నిర్వహించబడుతుంది.
  • ఎంపిక ప్రక్రియ మరియు ముసాయిదా సభ్యుల ఫలితాలు అక్టోబర్ 31, 2021 చివరినాటికి ప్రకటించబడతాయి.
  • నియమితులైన ఎంపికదారులు ముసాయిదా కమిటీకి అభ్యర్థులుగా ఉండజాలరు.

వికిమీడియా ఫౌండేషన్‌ చేత నియామకం

ముసాయిదా కమిటీకి 2 సభ్యులను వికిమీడియా ఫౌండేషన్‌ ఎంపిక చేస్తుంది.

  • ఫౌండేషన్‌ ఇద్దరు సిబ్బంది సభ్యులను నామినేట్‌ చేస్తుంది, వీరు సాధారణ అభ్యర్థుల సమూహంలో చేరతారు.
  • ఫౌండేషన్‌ అక్టోబర్ 10, 2021 నాటికి 2 ఎంపికదారులను నియమిస్తుంది.
  • ప్రాజెక్టుల ఎన్నిక మరియు అనుబంధాల ఎంపిక ఫలితాల ఒక రోజు తరువాత, ఫౌండేషన్ ఇద్దరు అదనపు సభ్యులను అక్టోబర్ 25 - 31, 2021 వారంలో సమూహం నుంచి ఎంపిక చేస్తుంది.
  • డబ్ల్యూఎమ్‌ఎఫ్‌ (వికిమీడియా ఫౌండేషన్) ఎంపిక ప్రక్రియ ఫలితాలను అక్టోబర్‌ 31, 2021 చివరినాటికి ప్రకటిస్తారు.

Calculating results

  • When counting the results, the following order will be taken: 1. elections, and 2. selection.
    • This means that, in the elections process, the 7 top candidates will be first appointed.
    • Afterwards, the top candidates in the affiliate selection process will be ranked. If any of them has been elected already, they will be skipped. Eventually, 6 additional top candidates will be appointed through the selection process.

అదనపు నియామకం మరియు స్థానభర్తీ

  • కమిటీని ఏర్పాటు చేసిన తరువాత, వారు ఏకాభిప్రాయంతో ముగ్గురు అదనపు అభ్యర్థుల వరకు నియమించుకొనే అవకాశముంది. ఇది వైవిధ్యం మరియు నైపుణ్యత అంతరాన్ని పూడ్చడం కోసం ఉంటుంది.
  • ఏ కమిటీ సభ్యుడైనా వారి విధులను నెరవేర్చడానికి అందుబాటులో లేకపోతే, సభ్యుల స్థానభర్తి యంత్రాంగాన్ని ఉపయోగిస్తారు:
    • ఎన్నుకోబడిన అభ్యర్థుల కోసం 2 ప్రత్యామ్నాయాలను అందించడానికి ఎన్నికల ప్రక్రియ ఏర్పాటు చేస్తుంది.
    • ఎంపిక చేత నియమించబడిన ఏ అభ్యర్థినైన స్థానభ్రంశం చేయడానికి ఎంపిక బృందం సమావేశమవుతుంది.
    • డబ్ల్యూఎమ్‌ఎఫ్‌ (వికిమీడియా ఫౌండేషన్) చేత నామినేట్‌ అయిన ఏ అభ్యర్థినైనా డబ్ల్యూఎమ్‌ఎఫ్‌ ఎంపికదారులు స్థానభ్రంశం చేస్తారు.

గత వెర్షన్‌లు

ఇది కూడా చూడండి