Jump to content

Wikimedia Foundation elections/2021/Candidates/Pavan Santhosh Surampudi/te

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Wikimedia Foundation elections/2021/Candidates/Pavan Santhosh Surampudi and the translation is 96% complete.
Outdated translations are marked like this.

పవన్ సంతోష్ సూరంపూడి (Pavan santhosh.s)

Pavan santhosh.s (talk meta edits global user summary CA  AE)

సారాంశం వివరాలు
హైదరాబాదులోని బీవీఆర్ఐటీ కళాశాలలో, (2017 జూలై)
  • సంపాదకీయం:
    • ఎప్పటినుండి Wikimedian ?: 2013 డిసెంబరు
    • యాక్టివ్ వికీలు: తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్స్, కామన్స్
statement (Not more than 450 words) వైవిధ్యభరితమైన అవకాశాలూ, సంక్లిష్టమైన సమస్యలూ అల్లుకుని ఉన్న భారతదేశంలాంటి చోట సముదాయాలను నిర్మించడంలో, విధాన నిర్ణయాలు/నిర్వహణలో, భాగస్వామ్యాల రూపకల్పనలో నాకున్న విశిష్టమైన అనుభవం, లోచూపు బోర్డు సభ్యునిగా నా పనికి సాయపడతాయి.

నేను దక్షిణ భారతదేశం నుంచి వచ్చాను. 2013లో తెలుగు వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడం అన్నది వికీమీడియా ఉద్యమంతో నాకున్న అనుబంధానికి ప్రారంభం అని చెప్పవచ్చు. మొదటి నుంచీ నేను కంటెంట్ అభివృద్ధి, సముదాయ అభివృద్ధి కోసం పనిచేయడం, ప్రాజెక్టులను రూపకల్పన చేసి, అమలుచేయడం, మూవ్ మెంట్ గవర్నెన్స్ వంటివాటిలో భాగస్వామిని అయ్యాను. 750+ కొత్త వ్యాసాలను సృష్టించడం, తెలుగు వికీపీడియాలోని 800 పైచిలుకు వ్యాసాలను చెప్పుకోదగ్గ స్థాయికి మెరుగుపరచడం వంటి కార్యకలాపాలతో వికీమీడియా ప్రాజెక్టులు అన్నిటిలోనూ కలిపి 49,000 దిద్దుబాట్లు చేశాను. నేను దిద్దుబాట్లు చేయడం మొదలుపెట్టిన నెలలోనే, తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవానికి హాజరయ్యాను. ఆ కార్యక్రమం నాకు సముదాయం గురించి, సముదాయపు లక్ష్యాల గురించి మంచి అవగాహన కలగడానికి సాయంచేసింది. దాని వల్ల నేను పలు ఆన్-వికీ, ఆఫ్-వికీ కార్యక్రమాల్లో పాల్గొనసాగాను. నేను అప్పట్లో చేసిన చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఏమిటంటే డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఉన్న తెలుగు పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా, వాటిని వాడి కంటెంట్ సృష్టించేదుకు వీలుకలిగేలా ఆన్-వికీ క్యాటలాగ్ రూపకల్పన చేయడం.

ఆ తర్వాత, నేను సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ - యాక్సెస్ టు నాలెడ్జ్ టీంలో తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు కమ్యూనిటీ అడ్వొకేట్‌గా చేరాను. ఇందులో నా ముఖ్యమైన బాధ్యతలు: తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో కంటెంట్, నాణ్యత పెంపొందించడం, సముదాయం అభివృద్ధి చెందడానికి పనిచేయడం, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరిచి నిర్వహించడం, సముదాయానికి కొత్త నైపుణ్యాలు, సామర్థ్యాలు ఏర్పరచడం. నేను ప్రారంభించిన ఒక ప్రాజెక్టు వల్ల తెలుగు వికీపీడియాలో 25,000 మొలక వ్యాసాలు కనీస స్థాయికి అభివృద్ధి చెందాయి, ట్రైన్-ద-ట్రైనర్ 2019, వికీమీడియా సమ్మిట్ ఇండియా 2019 వంటివి సహ-నిర్వహణ చేశాను. నా ఈ అనుభవంలో విద్యా సంస్థలతోనూ, ప్రభుత్వ విభాగాలతోనూ భాగస్వామ్యాలు ఏర్పరిచి నిర్వహించడం కూడా ఉంది. నేను మూవ్‌మెంట్ స్ట్రాటజీ ప్రాసెస్‌లో కమ్యూనిటీ హెల్త్ వర్కింగ్ గ్రూపులో కూడా పనిచేశాను.

నేను ప్రస్తుతం Quoraలో కమ్యూనిటీ మేనేజర్‌గా ప్రపంచవ్యాప్తంగా Quora తెలుగు సముదాయాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం చేస్తున్నాను. Quora తెలుగు ప్రారంభం నుంచి నేను కమ్యూనిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ప్రాజెక్టు ఆల్ఫా, బీటీ దశల్లోనూ, పబ్లిక్ లాంచ్ సమయంలోనూ, ఆ తర్వాత కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరిస్తూ ప్రొడక్ట్, ఇంజనీరింగ్ టీంలతో సన్నిహితంగా పనిచేస్తున్నాను. ప్రాజెక్టు అభివృద్ధి కోసం భాగస్వామ్యాలపైన, మార్కెటింగ్ వ్యూహాలు అభివృద్ధి చేసి, అమలుచేయడంలోనూ కూడా పనిచేస్తాను.


నా ప్రేరణ గురించి, లక్ష్యాల గురించి

ప్రపంచవ్యాప్తంగా పలు విజ్ఞాన భాండాగారాలను అందుబాటులోకి తీసుకువచ్చి, అందరి స్వంతం చేయడంలోనూ, తద్వారా లక్షలాదిమంది జీవితాలను ప్రభావితం చేయడంలోనూ వికీమీడియా ప్రాజెక్టులకు పాత్ర ఉండడం నాకు ఈ ప్రాజెక్టులపై కృషిచేయడానికి నిరంతర స్ఫూర్తి. ప్రస్తుతం పలుచోట్ల ప్రభుత్వాలూ, సామాజిక వ్యవస్థలూ నిర్లక్ష్యం వహించి, విజ్ఞానం అందుబాటు నుంచి దూరంగా పెడుతున్న ఇంకెందరో వ్యక్తుల జీవితాలపై సానుకూలమైన, సుస్థిరమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం వికీమీడియా ఉద్యమానికి ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న వేధింపులు, వైవిధ్యం లేమి, కేంద్రీకృతమైన అధికారం, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలను స్వీకరించి వాడుకోవడంలో లోపాలు - ఈ దిశగా వికీమీడియా ఉద్యమ ప్రగతి వేగాన్ని నెమ్మదింపజేస్తున్నాయి. కాబట్టి, నేను వికీమీడియా ఫౌండేషన్ బోర్డు సభ్యునిగా సేవలందిస్తూ మూవ్‌మెంట్ గవర్నెన్స్‌లో నావంతు ఈ దిశగా మెరుగుపరచాలన్నది నా బలమైన ప్రేరణ.

Top 3 Board priorities 1. సీఈవో ఎంపిక, ఆన్-బోర్డింగ్: క్యాథరిన్ మెహెర్ (తాజా మాజీ-సీఈవో) చేసిన కొత్త ప్రయత్నాలు, తీసుకున్ని చర్యల నుంచి లాభం పొంది, అభివృద్ధి సాగించాలంటే సరైన వ్యక్తిని సీఈవోగా ఎంపికచేయడం చాలా ముఖ్యం. తద్వారా ఈమధ్యకాలంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి అంతకుముందు కొంతకాలం సాగిన అనిశ్చితి వైపుకు ఉద్యమాన్ని తీసుకుపోకుండా ఉంటాము.

2. ఉద్యమవ్యాప్తంగా ఉన్న భాగస్వాములకు మరింత అధికారం: వికీమీడియా ఉద్యమ సంస్థలకు అధికారం కల్పించి, ప్రపంచవ్యాప్తంగా అధికార కేంద్రీకరణ తగ్గించడం అన్నది మనం కట్టుబడి ఉన్న స్ట్రాటజిక్ డైరెక్షన్‌లో ముందుకుసాగడానికి చాలా కీలకం.

3. సముదాయంతో బోర్డు సంబంధాలు మెరుగుపరచడం: సముదాయంతో కలసిపనిచేయడంలో నమ్మకాన్ని ఏర్పరుచుకోవడం, ఇది నా సంస్థ అన్న అభిప్రాయం వారికి కల్పించడం చాలా ముఖ్యం. ఉద్యమవ్యాప్తంగా సముదాయం అన్నది చాలా ముఖ్యమైన, అత్యంత కీలకమైన భాగస్వామి. నిర్ణయాలను తీసుకోవడంలో సముదాయానికి మరింత పాత్ర ఉండాలి. పలు మార్గాల్లో బోర్డు అన్నది సముదాయానికి తేలికగా అందుబాటులో ఉండాలి.

Top 3 Movement Strategy priorities 1. నైపుణ్యాలు, నాయకత్వ అభివృద్ధిలో మదుపు: సమర్థంగా అమలయ్యే నైపుణ్యాలు, నాయకత్వాల అభివృద్ధి కార్యక్రమం లేకపోతే ఇప్పుడు మూవ్‌మెంట్‌లో జరుగుతున్న దానికి, రేపు జరగబోయేదానికి తేడా చాలా స్వల్పంగా ఉంటుంది. అంతేగాక, వికీమీడియా ఫౌండేషన్, ఉద్యమం వాలంటీర్ల అత్యున్నత స్వచ్ఛంద కృషి ఫలితంగా నిర్మాణమయ్యాయి కనుక ఇది వారికి తిరిగి ఇవ్వడం కిందకు రాగలదు.

2. వికీమీడియా ప్రపంచం వ్యాప్తంగా విజ్ఞాన నిధి ఏర్పాటుచేయడం: చక్కగా వ్యవస్థీకృతమైన, బహుభాషల్లో ఉండే వికీమీడియా ప్రపంచ వ్యాప్తమైన విజ్ఞాన నిధి ఏర్పాటుచేయడం అన్నది ప్రపంచవ్యాప్తంగా నాయకత్వానికి, గవర్నెన్స్‌కి సహాయకారి అవుతుంది. ప్రపంచంలోనే ప్రధాన విజ్ఞాన వనరుగా ఉన్న మనకు, సంస్థాగతంగా ఒక మంచి విజ్ఞాన నిధి లేకపోవడం ఒక లోటు.

3. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడం: ప్రస్తుతం సాంకేతికంగా జరుగుతున్న అభివృద్ధిని వికీమీడియా ప్రాజెక్టులు అందుకోవాలి, అది కొత్త వాడుకరులు రావడంలోనూ, నిలబడడంలోనూ ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తుంది.

Verification Identity verification performed by Wikimedia Foundation staff and eligibility verification performed by the Elections Committee
Eligibility: Verified
Verified by: Matanya (talk) 20:45, 1 July 2021 (UTC)[reply]
Identification: Verified
Verified by: Joe Sutherland (Wikimedia Foundation) (talk) 18:20, 29 June 2021 (UTC)[reply]
Trustee Evaluation Form
Trustee Evaluation Form
Years of Experience
<1 1–2 2–5 5–10 10+

Wikimedia experience. The candidate is a dedicated contributor to the Wikimedia movement. Eligible contributions include: contributions to the Wikimedia projects, membership in a Wikimedia organization or affiliate, activities as a Wikimedia movement organizer, or participation with a Wikimedia movement ally organization.

5-10 సంవత్సరాలు: 2013 డిసెంబరు నుంచి నేను వికీమీడియా ప్రాజెక్టుల్లో కృషిచేస్తున్నాను. ప్రస్తుతం నేను తెలుగు వికీపీడియాలో నిర్వాహకుణ్ణి. నా కృషి ప్రధానంగా తెలుగు వికీపీడియాలోనే చేశాను. నేను తెలుగు వికీపీడియాలో 750+ కొత్త వ్యాసాలు సృష్టించాను, 800 పైచిలుకు వ్యాసాలను చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపరిచాను, మొత్తంగా 49,000 గ్లోబల్ ఎడిట్లు చేశాను. నేను సముదాయ అభివృద్ధిలో, ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో, మూవ్‌మెంట్ గవర్నెన్స్‌లో పాలుపంచుకున్నాను.

Board experience. The candidate has served on the board of trustees/directors or other similar governing body of a nationally- or globally-focused organization (non-profit, for-profit, or governmental).

లేదు. నాకు బోర్డులో పనిచేసిన అనుభవం లేదు.

Executive experience. The candidate has worked at an executive level for an organization, department, or project of comparable (or greater) size, complexity, and scope to the Wikimedia Foundation.

లేదు. నాకు ఎగ్జిక్యూటివ్-స్థాయిలో అనుభవం లేదు. కానీ ప్రస్తుతం, నెలకు 300 మిలియన్లకు పైగా వాడుకరులు ఉన్న Quoraలో పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం [$17 Quoraలో కమ్యూనిటీ మేనేజర్‌గా] ప్రపంచవ్యాప్తంగా Quora తెలుగు సముదాయాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం చేస్తున్నాను. Quora తెలుగు ప్రారంభం నుంచి నేను కమ్యూనిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ప్రాజెక్టు ఆల్ఫా, బీటీ దశల్లోనూ, పబ్లిక్ లాంచ్ సమయంలోనూ, ఆ తర్వాత కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరిస్తూ ప్రొడక్ట్, ఇంజనీరింగ్ టీంలతో సన్నిహితంగా పనిచేస్తున్నాను. ప్రాజెక్టు అభివృద్ధి కోసం భాగస్వామ్యాలపైన, మార్కెటింగ్ వ్యూహాలు అభివృద్ధి చేసి, అమలుచేయడంలోనూ కూడా పనిచేస్తాను.

Subject matter expertise. The candidate has worked or significantly volunteered in an area relevant to the work of the Foundation and the Board. Such areas will be determined on an annual basis and may include areas such as Global movement building and community organization, enterprise-level platform technology and/or product development, public policy and the law, knowledge sector (e.g., academia/GLAM/education), human rights and social justice, open Internet/free and open source software, organizational strategy and management, finance and financial oversight, non-profit fundraising, human resources, board governance.

అవును. సముదాయ అభివృద్ధి నా నైపుణ్యం. నేను సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ - యాక్సెస్ టు నాలెడ్జ్ టీంలో తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు కమ్యూనిటీ అడ్వొకేట్‌గా చేరాను. ఇందులో నా ముఖ్యమైన బాధ్యతలు: తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో కంటెంట్, నాణ్యత పెంపొందించడం, సముదాయం అభివృద్ధి చెందడానికి పనిచేయడం, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరిచి నిర్వహించడం, సముదాయానికి కొత్త నైపుణ్యాలు, సామర్థ్యాలు ఏర్పరచడం. Quoraలో ప్రస్తుతం కమ్యూనిటీ మేనేజర్‌గా సముదాయాలను నిర్మించడం, నిర్వహించడంలో పనిచేస్తున్నాను.

Diversity: Background The candidate belongs or belonged to a group that has faced historical discrimination and underrepresentation in structures of power (related to, for example, gender, race, ethnicity, disability, LGBTQ+ identity, social class, economic status, or caste).

అవును. నేను స్ట్రెయిట్ మగవాడిని. నేను 1980ల్లో ఆంధ్రప్రదేశ్‌లో తనకున్న రాజకీయ, ఆర్థిక ప్రాబల్యాన్ని కోల్పోయిన సాంప్రదాయిక ఉన్నత కులంలో జన్మించాను. నేను కిందిస్థాయి మధ్యతరగతి నేపథ్యంలో, 9 మంది కుటుంబ సభ్యులను తనకు వచ్చే జీతంతో పోషించాల్సిన తండ్రికి కుమారుడిగా పెరిగాను. ఒకే వ్యక్తి పనిచేసి మిగిలినవారిని పోషించాల్సి రావడం, ఆ కారణంగా ఆర్థిక సమస్యలు ఆనాటి భారత మధ్యతరగతిలో సర్వసాధారణం. నా విద్యాభ్యాసాన్ని ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలకూ, భారతదేశంలోని అత్యున్నత విద్యాలయాలకు దూరంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో సాగించాను.

ఈ నేపథ్యం నాకు కొన్ని విషయాల్లో పైమెట్టు మీద (ప్రివిలేజ్డ్), కొన్ని విషయాల్లో కింది మెట్టు మీద (అండర్-ప్రివిలేజ్డ్) నిలబెట్టింది.

ఉదాహరణకు, నా స్వంత కుటుంబంలో (2000 చివర్లో గ్లోబలైజేషన్ ఫలితాలను అందుకున్న మా బంధువులను మినహాయించి, కేవలం మా కుటుంబాన్ని లెక్కిస్తే 2-3 తరాల్లో చూసినా) విమానంలో ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. నా మొదటి విమానయానాన్ని మా తల్లిదండ్రులు, తోబుట్టువులు వేడుకగా జరుపుకున్నారు. అయితే, ఇక్కడ చెప్పాల్సిన మరో విషయం ఏమిటంటే భారతదేశంలో ఇప్పటికీ కోట్లాదిమంది విమానంలో కాలుమోపలేదు.

Diversity: Geography The candidate would contribute to the overall geographic diversity of the Board of Trustees, based on the geographic regions where they have lived.

అవును. నేను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చాను.

Diversity: Language The candidate is a native speaker of a language other than English.

అవును. నా మాతృభాష తెలుగు. నేను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నాను, ఐతే నా మాతృభాష, దానిలోని సాంస్కృతిక, సాహిత్య విశిష్టతలు నన్ను ఎప్పుడూ విపరీతంగా ఆకర్షించేవి. తెలుగు ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో 11వది, భారతదేశంలో నాలుగవది, కానీ, ప్రపంచంలోని అనేక వలసవాద అనంతర సమాజాల్లోలాగానే దానికి ప్రభుత్వం నుంచి, వ్యవస్థల నుంచి ప్రోత్సాహం, మద్దతు కరువయ్యాయి. వ్యక్తిగతంగా నేను నా విద్యాభ్యాసం సమయంలోనూ, ఆ తర్వాత కూడా, ఈ విధానాల వల్ల బాధితుడిని. ఈ భాషల పరిస్థితిని అర్థంచేసుకోవడం, మెరుగుపరచడం, తద్వారా విద్యా, విజ్ఞానాల విషయంలో సమానత్వానికి కృషిచేయడం అన్నది నాకు ప్రధానమైన ప్రేరణ.

Diversity: Political system experience The candidate has substantial experience living in and/or working to share knowledge in a non-democratic, state-censoring, or repressive context.

లేదు.