Jump to content

Grants:Project/సత్వర

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Grants:Project/Rapid and the translation is 93% complete.
Outdated translations are marked like this.
Rapid Funds

Who?

వ్యక్తులు, సమూహాలు, వికీమీడియా ఎఫిలియేట్లు లేదా వికీమీడియా మూవ్‌మెంటుకు చెందిన సంస్థలు

What?

వికీమీడియా కేంద్రితమైన స్వల్పకాలిక, తక్కువ ఖర్చుతో కూడిన ప్రాజెక్టులు (1-12 నెలలు)

When?

నెలల ప్రాసెసింగు సమయం, ప్రతి రెండు నెలలకూ ఒక రౌండు

How much?

500 - 5,000 USD


దరఖాస్తు చేసుకోవడం ఎలా

  1. వేటికి నిధులు ఇస్తాము, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేవాటి గురించి కింద చూడండి.
  2. వికీమీడియా ఫౌండేషను వారి గ్రాంటీ పోర్టల్ (Fluxx) కు వెళ్ళి లాగినవండి.
    • అక్కడ మీకు ఖాతా లేకపోతే, "నమోదు చేసుకోండి" నొక్కి అడిగిన సమాచారం ఇవ్వండి. రెండు రోజుల్లో మీ నమోదును ధ్రువీకరిస్తారు.
  3. ప్రధాన పేజీలో ఉన్న ర్యాపిడ్ గ్రాంట్ నిధి కోసం దరఖాస్తు చెయ్యండి (Apply for Rapid Fund) ని ఎంచుకోండి. అప్లికేషన్ను భద్రపరచేందుకు, భద్రపరచి కొనసాగు (Save and Continue) ను గాని, భద్రపరచి మూసివేయి (Save and Close) ని గానీ నొక్కండి.
  4. అప్లికేషను ఫారంలో ఉన్న సూచనలను పాటించండి. అక్కడ మీ ప్రాజెక్టు గురించిన సమాచారం ఇవ్వడంతో పాటు, అనేక డాక్యుమెంట్లను ఎక్కించవలసి ఉంటుంది.
  5. "సమర్పించు" నొక్కినపుడు, మీ అప్లికేషను సమీక్ష కోసం వెళ్తుంది.

  • దరఖాస్తులను ఏ భాషలోనైనా స్వీకరిస్తాం. అవసరాన్ని బట్టి, దరఖాస్తులను, చర్చలనూ మేం అనువదించుకుంటాం.
  • దరఖాస్తులు రెండు రోజుల్లో ఆటోమాటిగ్గా మెటా-వికీలో ప్రచురించబడతాయి. సముదాయం సమీక్ష కోసం, ప్రతిస్పందన కోసం అవి అందుబాటులో ఉంటాయి.
  • దరఖాస్తును ఆఫ్‌లైన్లో కూడా సిద్ధం చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం కాపీని తయారు చేసుకుని, అక్కడి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, ఆ వచనాన్ని ఫ్లక్స్ లో పేస్టు చేయవచ్చు.
Rapid Fund Application Form (Google Docs)
Rapid Fund Budget Template (Google Sheets)

వేటికి నిధులు ఇస్తాం

మీ ప్రాజెక్టు వికీమీడియా లక్ష్యాలను వ్యూహాత్మక దిశనూ సాధించడంలో తోడ్పడేలా ఉండాలి. వికీమీడియా ప్రాజెక్టులను మెరుగుపరచే లక్ష్యం దానికి ఉండాలి.

మేం నిధులిచ్చే ప్రాజెక్టుల ఉదాహరణలు
  • ఒక సార్వత్రిక ప్రచారానికి సంబంధించి, తమ సముదాయంలో జరిగే స్థానిక కార్యక్రమాలకు తోడ్పడే వ్యక్తులకు
  • అధికారిక, అనధికారిక సాముదాయిక సమావేశాలు
  • వికీమీడియా ఎడిటథాన్‌లు, వర్క్‌షాపులు
  • వికీమీడియా ఎఫిలియేట్ల వ్యూహాత్మక, వార్షిక ప్రణాళికలు
  • వికీపీడియా, వికీడేటా తదితర వికీమీడియా ప్రాజెక్టులలో చదవడం లోను, దిద్దుబాట్లు చెయ్యడంలో శిక్షణ నివ్వడం పైనా నిర్వహించే విద్యా ప్రాజెక్టులు.
  • కంటెంటును చేర్చడం, నిర్వహించడం, ఆ కంటెంటును వాడుకునేందుకు ప్రోత్సహించడం లకు తోడ్పాటు నిచ్చే సాంస్కృతిక, వారసత్వ ప్రాజెక్టులు.
  • మహిళలను, ఇతర లైంగిక వైవిధ్యం కలిగిన వారిని సమీకరించి, వారికి శిక్షణ నిచ్చే లింగ, వైవిధ్యాలకు సంబంధించిన ప్రాజెక్టులు. అలాగే, మహిళలకు, ఆయా సమూహాలకు, అంతగా గుర్తింపు లేని సముదాయాలకూ వారికి సంబంధించిన పరిజ్ఞానం గురించీ కంటెంటును సృష్టించడం.
  • చిన్న తరహా సాఫ్ట్‌వేరు అభివృద్ధి ప్రాజెక్టులు
మేము సాయం చేసే ఖర్చులకు ఉదాహరణలు
  • ఎడిట్-ఎ-థోన్స్, పోటీలు, ఫోటోవాక్‌లు, ప్రచార క్రమాలకు అవసరమైన పని స్థలం, సేవలు, బహుమతులు, ఔట్రీచ్, ఇతర సాధారణ ఖర్చులు.
  • ఆన్‌లైన్ ఈవెంట్లకు అవసరమయ్యే డేటా ఖర్చులు
  • నిర్వాహకులకు ప్రాజెక్టు సంబంధిత ప్రయాణాలు
  • స్వచ్ఛంద సేవకులు చెయ్యలేని, స్పష్టంగా నిర్వచించబడిన పనులు. గ్రాఫిక్ డిజైను, శిక్షణ, శిశు సంరక్షణ, అనువాదం, ప్రాజెక్టు మేనేజిమెంటు, వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ వంటివి ఇలాంటి పనులలో కొన్ని.
ప్రయాణాలకు, పరికరాలకూ నిధులు సమకూర్చడం
  • కేవలం ప్రయాణ స్కాలర్షిప్పులు, సదస్సులో పాల్గొనడానికీ నిధులు ఇవ్వం. సత్వర నిధులు అనేవి ప్రాజెక్ట్ ఆధారిత వనరులు. ప్రాజెక్టు అమలు కోసం అవసరమైన ప్రయాణాల కోసం మాత్రమే నిధులు ఇస్తాం.
  • సమూహాలు, సంస్థలు, ఎఫిలియేట్లు వస్తువులు, ఉపకరణాలు కొనుక్కునే వీలుంది. వీటి కోసం చేసే గ్రాంటు అభ్యర్థనల్లో ఆయా వస్తువులను ఇతర సముదాయ సభ్యులతో ఎలా పంచుకుంటారో వివరంగా చూపాలి. పరికరాల లాగ్ గానీ, జాబితా గానీ సముదాయ సభ్యులందరికీ అందుబాటులో ఉండాలి. అది అప్లికేషనులో కూడా ఉండాలి. సత్వర నిధులు పొందగలిగే పరికరాలకు ఉదాహరణలు: ల్యాప్‌టాపులు, కెమెరాలు, ప్రొజెక్టరు, రౌటర్లు, ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లు.
సాఫ్ట్‌వేరు అభివృద్ధి కోసం నిధులు
  • చిన్నపాటి సాఫ్ట్‌వేరు అభివృద్ధి ప్రాజెక్టులు సాముదాయిక వనరులు, టెక్నాలజీ డెవలప్‌మెంటు సిబ్బందిల సమీక్షలపై ఆధారపడి గ్రాంటులకు అర్హత పొందవచ్చు.
  • ప్రాజెక్ట్ కోడ్ బహిరంగంగా అందుబాటులో ఉండాలి. సంబంధిత వికీమీడియా ప్రాజెక్టులకు వర్తించే ఉచిత సాఫ్ట్‌వేరు లైసెన్సు క్రింద వాటిని ప్రచురించాలి.
  • ప్రతిపాదిత కార్యకలాపాలలో భాగంగా డాక్యుమెంటేషన్ ప్రణాళిక ఉండాలి.
  • అభివృద్ధి కోసం గాని, నిర్వహణ కోసం గానీ దీర్ఘకాలం పాటు అనేక విడతలుగా గాని, వరుసగా గానీ సత్వర నిధులపై ఆధారపడే ప్రాజెక్టులకు సాధారణంగా నిధులు ఇవ్వం.
పరిశోధన కోసం నిధులు
నిధుల దరఖాస్తుల ఉదాహరణలు

అర్హతలు

మీకు కింది అంశాలు వర్తిస్తే మీరు ఈ నిధికి అర్హులే:

  • 500-5000 డాలర్ల మధ్య నిధుల కోసం దరఖాస్తు చేస్తున్నారు లేదా మరొక కరెన్సీలో దరఖాస్తు సమయానికి దానికి సమానమైన విలువకలిగినది. నిధులు మీ స్థానిక కరెన్సీలో అందజేయబడతాయి.
  • మీరు వికీమీడియా సముదాయ సభ్యులు, లేదా వికీమీడియా మూవ్‌మెంటుకు చెందిన సమూహం లేదా సంస్థలో భాగం.
  • మీది 1-12 నెలల కాలం పాటు జరిగే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు, భవిష్యత్తులో జరిగేది, ప్రణాళికాబద్ధమైనదీ అయి ఉండాలి.
  • ప్రస్తుతం ఓపెన్‌గా ఉన్న మరొక సత్వర నిధి మీ పేరిట ఉండకూడదు. అలాంటి గ్రాంతు ఏదైనా ఉంటే, కొత్త గ్రాంటు కోసం దరఖాస్తు చేసే ముందు దాని నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, కొత్త గ్రాంటు అభ్యర్థనను సమప్రించే ముందు, మీ పాత గ్రాంటు నివేదికకు పునస్సమీక్షించమని ప్రోగ్రాం ఆఫీసరు మిమ్మల్ని కోరవచ్చు.
    • ఒక ఆర్థిక సంవత్సరంలో (ఉదాః 2023 జూలై 1-2024 జూన్ 30) ఒక వ్యక్తి పొందగలిగే నిధి మొత్తం USD 10,000 వరకు ఉంటుంది.
  • మీరు సంస్థ లేదా సమూహం అయితే, ఏ సమయంలోనైనా ఓపెన్‌గా ఉన్న గ్రాంట్లు 2 కంటే తక్కువ ఉండాలి.
    • సంస్థ లేదా సమూహం అయితే, ప్రతి ఆర్థిక సంవత్సరంలో (ఉదాః 2023 జూలై 1-2024 జూన్ 30) పొందగలిగే మొత్తం నిధి USD 10,000 వరకు ఉంటుంది. జాయింట్ బ్యాంకు ఖాతా ఉంటే మంచిది.
  • మీ గ్రాంటు దరఖాస్తులో పేర్కొన్న లక్ష్యిత వికీమీడియా ప్రాజెక్టులో మీకు వర్తమాన సహకార చరిత్ర, అనుభవమూ ఉండాలి. మీకు నిర్వహణ అనుభవం లేదా శిక్షణ అనుభవం కూడా ఉండాలి. ఉదాహరణకు, మీరు వికీడేటాలో కొత్తవారికి శిక్షణ ఇవ్వాలనుకుంటే, మీరు వికీ డేటాలో దిద్దుబాట్లు, శిక్షణ చేసిన చరిత్రను చూపించాలి.
  • మీ గ్రాంటు గురించి జట్టు సభ్యులకు తెలియజేసి ఉండాలి. మీ ప్రతిపాదన గురించి సముదయంలో చర్చించి ఉండాలి.
కింది అంశాలు వర్తిస్తే మీరు నిధులకు అర్హులు కారు:
  • మీ ప్రాజెక్టు థర్డ్ పార్టీ వెబ్‌సైట్లను మెరుగుపరచేందుకైతే.
  • యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ నిర్వచనాల ప్రకారం, మీ ప్రాజెక్టులో లాబీయింగు పనులు ఉంటే [1]
  • ప్రాజెక్టు లోని పనులు, తోడ్పాటులూ నైతిక, స్వేచ్ఛా వినియోగ ఒప్పందాలకు అనుగుణంగా ప్రచురించని పక్షంలో.
  • యునైటెడ్ స్టేట్స్ లోను, మీ దేశంలోనూ ఉండే నిధుల పంపకం చట్టాలకు అనుగుణంగా, మీరున్న దేశం లోకి మీరు తలపెట్టిన పనులకు నిధులు పంపడం, స్వీకరించడం చెయ్యలేనట్లైతే.
  • వర్తమానంలో వికీమీడియా ఫౌండేషను సమకూర్చే కార్యక్రమాలకు సంబంధించి మీ చరిత్ర సరిపడినట్లుగా లేనట్లైతే, ఆయా అర్హతలకు అనుగుణంగా మీరు లేనట్లైతే
  • యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ స్పెషల్లీ డెజిగ్నేటెడ్ నేషనల్స్ అండ్ బ్లాక్‌డ్ పర్సన్స్ లిస్ట్ (SDN) జాబితాలో మీ పేరు ఉన్నట్లైతే.
  • మీరు వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది గానీ, కాంట్రాక్టరు గానీ అయితే.
  • మీరు జనరల్ సపోర్ట్ నిధి లో గ్రాంటీ భాగస్వాములైతే.
  • మీరు బోర్డు సభ్యులు, నాయకులు (AffCom కు కాంటాక్టులను సమర్పించారు), అధ్యక్షుడు, బ్యాంకు ఖాతా సంతకందారు[2], కార్యనిర్వాహక డైరెక్టరు, లేదా జీతం తీసుకునే ఇతర సిబ్బంది లేదా వికీమీడియా ఫౌండేషను ఫండు పొందిన (జనరల్ సపోర్ట్ ఫండ్, సత్వర ఫండ్, పరిశోధన ఫండ్, కాన్ఫరెన్స్ ఫండ్, మూవ్‌మెంట్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ గ్రాంట్స్) వికీమీడియా ఎఫిలియేటు/సమూహం/సంస్థకు చెందిన కాంట్రాక్టరు.
    • స్వచ్ఛంద సేవక పాత్రకు (మరీ ముఖ్యంగా బోర్డు సభ్యులు), సమూహ కార్యక్రమాలకూ, వ్యక్తిగత గ్రాంటులకూ మధ్య గణించదగ్గ ఓవర్‌ల్యాప్ లేనపుడు ప్రోగ్రాం ఆఫీసరు ఈ అంశానికి మినహాయింపులు ఇవ్వవచ్చు.
  • వేరువేరు సమూహాలు, సంస్థల తరఫున మీరు దరఖాస్తు చేస్తున్నట్లైతే
  • వికీమీడియా ఫౌండేషను నుండి నిధులు పొందేందుకు ఆవశ్యకమైన పూర్తి సమాచారాన్ని, డాక్యుమెంట్లనూ మీరు ఇవ్వనట్లైతే
ఆవశ్యక ప్రవర్తనాంశాలు

దరఖాస్తుదారులందరూ సునిశితమైన పరిశీలన ప్రక్రియ గుండా వెళ్తారు. దానర్థం, మీరు ఋజువర్తన కలిగి ఉండాలి (ఉదాహరణకు, వికీమీడియా ప్రవర్తన, సామాజిక ప్రవర్తన, ఆర్థిక ప్రవర్తన, చట్టపరమైన ప్రవర్తన, మొదలైనవి.).

  • దరఖాస్తుదారు సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని, స్నేహపూర్వక విధానాలనూ తప్పకుండా పాటించాలి.
  • గ్రాంట్ ప్రోగ్రాముకు సంబంధించిన సునిశితమైన పరిశీలన ప్రక్రియ నిర్ణయించిన విధంగా, దరఖాస్తుదారులు ఋజువర్తన కలిగిన వారిగా సముదాయంలో గుర్తింపు ఉండాలి (ఉదాహరణకు, వికీమీడియా ప్రవర్తన, సామాజిక ప్రవర్తన, ఆర్థిక ప్రవర్తన, మొదలైనవి.).
  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని గాని, స్నేహపూర్వక వాతావరణ విధానాలను గానీ అతిక్రమించినందుకు లేదా ఇతర విధాలైన అతిక్రమణలు, ప్రవర్తనలకు గాను గత సంవత్సర కాలంలో వికీమీడియా ఫౌండేషను సిబ్బంది చేత గానీ, ఇతర ఎఫిలియేటు చేత గానీ దరఖాస్తుదారులు నిరోధం, నిషేధం, ఫ్లాగ్‌లు పొంది ఉండకూడదు. అలాంటివి గతంలో ఎప్పుడైనా పొంది ఉంటే, సదరు కారణాలకు సంబంధించి తాము ఆ తరువాతి కాలంలో తగు పాఠలు నేర్చుకున్నట్లు, అవి తమకు అర్థమైనట్లూ దరఖాస్తుదారులు చూపాలి. తద్వారా ఒక గ్రాంటీగా ఇతరులకు రోల్ మోడల్‌గా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని చూపాలి.
  • ఒకే అంశాలకు గాను, గత సంవత్సర కాలంలో వికీమీడియా ప్రాజెక్టుల్లో పదేపదే నిరోధం, ఫ్లాగ్‌లు పొంది ఉండకూడదు, నిషేధం పొంది ఉండకూడదు. దరఖాస్తుదారు ఖాతా చరిత్రలో అలాంటి నిరోధాలు/నిషేధాలు నమోదై ఉంటే, సదరు కారణాలకు సంబంధించి తాము ఆ తరువాతి కాలంలో తగు పాఠాలు నేర్చుకున్నట్లు, అవి తమకు అర్థమైనట్లూ దరఖాస్తుదారులు చూపాలి. తద్వారా ఒక గ్రాంటీగా ఇతరులకు రోల్ మోడల్‌గా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని చూపాలి.
  • దరఖాస్తుదారుపై ఏ వికీమీడియా ప్రాజెక్టులో నైనా నిరవధిక నిరోధం విధించి ఉంటే, వారు కోరుతున్న గ్రాంటు ఆ ప్రాజెక్టుకు సంబంధించినది కాకపోయినా సరే, వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు కారు.
యువత భద్రత

పిన్న వయస్కులు పాల్గొనే ఏ కార్యక్రమంలోనైనా యువత భద్రత విధానం అమల్లో ఉండాలి.

  • If the proposal indicates direct contact with children or youth, it also outlines compliance with international and local laws for working with children and youth, and provides documentation of the local laws in the annex.
  • The proposal demonstrates how they will ensure the safe engagement of young people in all of the project’s activities.
  • The proposal demonstrates that any adults who will be working in close contact with young people have been properly vetted and trained.
  • The proposal outlines an action protocol in the case that incidents occur relating to the physical and psychological safety of young people.

అదనపు గమనిక: We recommend applying for micro-funding programs and other similar opportunities in local communities where they are available, and where you can coordinate and work with other groups in your geography.

దరఖాస్తు ప్రస్థానం

దరఖాస్తును పంపించాక, కింది అంచెల ద్వారా దాని ప్రస్థానం సాగుతుంది:

తొలి సమీక్ష (7 రోజులు)

  • స్క్రీనింగుకు ముందు, ప్రోగ్రామ్ ఆఫీసరు చేసే అర్హతల తనిఖీ
  • సంబంధిత సమూహాలు, సముదాయాల నుండి అభిప్రాయాల సేకరణ

సమీక్ష (28 రోజులు)

  • గ్రాంటు నిర్వాహకులు చేసే అర్హతల, డాక్యుమెంటేషన్ల తనిఖీ
  • ప్రోగ్రాం ఆఫీసరు, రీజినల్ ఫండ్స్ కమిటీ లు చేసే సమీక్ష, ఫీడ్‌బ్యాకు
  • అభ్యర్థికి తన ప్రతిపాదనపై ఫీడ్‌బ్యాక్ వచ్చాక, దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చెయ్యడం

నిర్ణయాలు, ఒప్పందం (18 రోజులు)

  • ప్రోగ్రాం ఆఫీసరు నిర్ణయాలను ప్రకటిస్తారు.
  • గ్రాంటు ఒప్పందంపై మీరు, వికీమీడియా ఫౌండేషను సంతకాలు చేస్తారు
  • గ్రాంటు చెల్లింపు చేస్తారు

ప్రాజెక్టు ప్రారంభం

  • ప్రాజెక్టు ప్రారంభ తేదీ, పైన వివరించిన అన్ని అంగలూ పూర్తయ్యాక ఉండాలి

నివేదించడం (ప్రాజెక్టు ముగింపు తేదీ తరువాత 30 రోజుల్లో)

కాలక్రమం

సైకిల్ 6 (గడువు: 1 జూన్ 2024) (2023-2024)

సైకిల్ 6

1 జూన్ 2024

సమర్పణ చివరి తేది

2 జూన్ – 27 జూన్ 2024

సమీక్ష

1 జూలై 2024

నిర్ణయ ప్రకటన

1 జూలై – 15 జూలై 2024

గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు

16 జూలై 2024

ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ

సైకిల్ 1 (గడువు: 1 ఆగస్టు 2024)

సైకిల్ 1

1 ఆగస్టు 2024

సమర్పణ చివరి తేది

2 ఆగస్టు – 5 సెప్టెంబరు

సమీక్ష

13 సెప్టెంబరు 2024

నిర్ణయ ప్రకటన

14 సెప్టెంబరు – 27 సెప్టెంబరు

గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు

30 సెప్టెంబరు 2024

ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ

Key campaigns applying in this cycle: Wiki Loves Monuments, WikiVibrance International & Africa Youth Day, She Said - Wiki Loves Women, Wikipedia Asian Month.

సైకిల్ 2 (గడువు: 1 అక్టోబరు 2024)

సైకిల్ 2

1 అక్టోబరు 2024

సమర్పణ చివరి తేది

2 అక్టోబరు – 8 నవంబరు

సమీక్ష

15 నవంబరు 2024

నిర్ణయ ప్రకటన

16 నవంబరు – 29 నవంబరు

గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు

29 నవంబరు 2024

ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ

Key campaigns applying in this cycle: Art+Feminism, Visible Wiki Women, 1Lib1Ref.

సైకిల్ 3 (గడువు: 1 డిసెంబరు 2024)

సైకిల్ 3

1 డిసెంబరు 2024

సమర్పణ చివరి తేది

2 డిసెంబరు 2024 – 10 జనవరి 2025

సమీక్ష

24 జనవరి 2025

నిర్ణయ ప్రకటన

25 జనవరి – 7 ఫిబ్రవరి

గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు

7 ఫిబ్రవరి 2025

ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ

Key campaigns applying in this cycle: Wiki Loves Folklore, African Film & Cinema. Those applying for activities related to Women's Month and International Women's Da (8th March) will need to apply in Cycle 3.

సైకిల్ 4 (గడువు: 15 ఫిబ్రవరి 2025)

సైకిల్ 4

15 ఫిబ్రవరి 2025

సమర్పణ చివరి తేది

16 ఫిబ్రవరి – 21 మార్చి

సమీక్ష

28 మార్చి 2025

నిర్ణయ ప్రకటన

28 మార్చి – 11 ఏప్రిల్

గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు

11 ఏప్రిల్ 2025

ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ

Key campaigns applying in this cycle: Celebrate Women, CEE Spring, Wiki Loves Africa, Wiki Loves Earth, Wiki for Human Rights, Africa Wiki Challenge, 1Lib1Ref.

సైకిల్ 5 (గడువు: 1 మే 2025)

సైకిల్ 5

1 మే 2025

సమర్పణ చివరి తేది

2 మే – 6 జూన్

సమీక్ష

13 జూన్ 2025

నిర్ణయ ప్రకటన

14 జూన్ – 27 జూన్

గ్రాంట్ ప్రాసెసింగు, చెల్లింపు

27 జూన్ 2025

ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ

Key campaigns applying in this cycle: WPWP, Wiki Loves Monuments 2025, WikiVibrance International, and Africa Youth Day.

అన్ని రౌండ్లకు పూర్తి కాలక్రమం

సైకిల్ 1 - 1 ఆగస్టు 2024 – 30 సెప్టెంబరు 2024
తేది కార్యాచరణ వ్యవధి
1 ఆగస్టు 2024 సైకిల్ 1 లో దరఖాస్తుల సమర్పణ గడువు
8 ఆగస్టు 2024
  • ప్రోగ్రామ్ ఆఫీసర్ చేసే ప్రీ-స్క్రీనింగ్ అర్హత తనిఖీ
  • ప్రారంభ ఫీడ్‌బ్యాక్ కోసం సంబంధిత సమూహాలు, సంస్థలు, సంఘాలు, బృందాలు అన్నిటినీ ప్రోగ్రామ్ ఆఫీసరు సంప్రదించడం
7 రోజులు
22 ఆగస్టు 2024 14 రోజులు
5 సెప్టెంబరు 2024
  • అభ్యర్థికి తన ప్రతిపాదనపై ఫీడ్‌బ్యాక్ రావడం, దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చెయ్యడం
14 రోజులు
13 సెప్టెంబరు 2024
  • నిర్ణయాల ప్రకటన
7 రోజులు
27 సెప్టెంబరు 2024
  • గ్రాంట్ ప్రాసెసింగు, ఒప్పందంపై సంతకాలు చేయడం, గ్రాంట్ నిర్వాహకులచే గ్రాంటు చెల్లింపు
14 రోజులు
30 సెప్టెంబరు 2024
  • ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
1 అక్టోబరు 2024

తదుపరి సైకిల్ కోసం సమర్పణ గడువు

సైకిల్ 2 - 1 అక్టోబరు 2024 – 29 నవంబరు 2024
తేది కార్యాచరణ వ్యవధి
1 అక్టోబరు 2024 సైకిల్ 2 లో దరఖాస్తుల సమర్పణ గడువు
11 అక్టోబరు 2024
  • ప్రోగ్రామ్ ఆఫీసర్ చేసే ప్రీ-స్క్రీనింగ్ అర్హత తనిఖీ
  • ప్రారంభ ఫీడ్‌బ్యాక్ కోసం సంబంధిత సమూహాలు, సంస్థలు, సంఘాలు, బృందాలు అన్నిటినీ ప్రోగ్రామ్ ఆఫీసరు సంప్రదించడం
7 రోజులు
25 అక్టోబరు 2024 14 రోజులు
8 నవంబరు 2024
  • అభ్యర్థికి తన ప్రతిపాదనపై ఫీడ్‌బ్యాక్ రావడం, దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చెయ్యడం
14 రోజులు
15 నవంబరు 2024
  • నిర్ణయాల ప్రకటన
7 రోజులు
29 నవంబరు 2024
  • గ్రాంట్ ప్రాసెసింగు, ఒప్పందంపై సంతకాలు చేయడం, గ్రాంట్ నిర్వాహకులచే గ్రాంటు చెల్లింపు
14 రోజులు
29 నవంబరు 2024
  • ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
1 డిసెంబరు 2024 తదుపరి సైకిల్ కోసం సమర్పణ గడువు
సైకిల్ 3 - 1 డిసెంబరు 2024 – 7 ఫిబ్రవరి 2025
తేది కార్యాచరణ వ్యవధి
1 డిసెంబరు 2024 సైకిల్ 3 లో దరఖాస్తుల సమర్పణ గడువు
9 డిసెంబరు 2024
  • ప్రోగ్రామ్ ఆఫీసర్ చేసే ప్రీ-స్క్రీనింగ్ అర్హత తనిఖీ
  • ప్రారంభ ఫీడ్‌బ్యాక్ కోసం సంబంధిత సమూహాలు, సంస్థలు, సంఘాలు, బృందాలు అన్నిటినీ ప్రోగ్రామ్ ఆఫీసరు సంప్రదించడం
7 రోజులు
23 డిసెంబరు 2024 14 రోజులు
10 జనవరి 2025
  • అభ్యర్థికి తన ప్రతిపాదనపై ఫీడ్‌బ్యాక్ రావడం, దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చెయ్యడం
14 రోజులు
24 జనవరి 2025
  • నిర్ణయాల ప్రకటన
7 ఫిబ్రవరి 2025
  • గ్రాంట్ ప్రాసెసింగు, ఒప్పందంపై సంతకాలు చేయడం, గ్రాంట్ నిర్వాహకులచే గ్రాంటు చెల్లింపు
14 రోజులు
7 ఫిబ్రవరి 2025
  • ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
15 ఫిబ్రవరి 2025 తదుపరి సైకిల్ కోసం సమర్పణ గడువు
సైకిల్ 4 - 15 ఫిబ్రవరి 2025 – 11 ఏప్రిల్ 2025
తేది కార్యాచరణ వ్యవధి
15 ఫిబ్రవరి 2025 సైకిల్ 4 లో దరఖాస్తుల సమర్పణ గడువు
21 ఫిబ్రవరి 2025
  • ప్రోగ్రామ్ ఆఫీసర్ చేసే ప్రీ-స్క్రీనింగ్ అర్హత తనిఖీ
  • ప్రారంభ ఫీడ్‌బ్యాక్ కోసం సంబంధిత సమూహాలు, సంస్థలు, సంఘాలు, బృందాలు అన్నిటినీ ప్రోగ్రామ్ ఆఫీసరు సంప్రదించడం
7 రోజులు
7 మార్చి 2025 14 రోజులు
21 మార్చి 2025
  • అభ్యర్థికి తన ప్రతిపాదనపై ఫీడ్‌బ్యాక్ రావడం, దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చెయ్యడం
14 రోజులు
28 మార్చి 2025
  • నిర్ణయాల ప్రకటన
7 రోజులు
11 ఏప్రిల్ 2025
  • గ్రాంట్ ప్రాసెసింగు, ఒప్పందంపై సంతకాలు చేయడం, గ్రాంట్ నిర్వాహకులచే గ్రాంటు చెల్లింపు
14 రోజులు
11 ఏప్రిల్ 2025
  • ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ
1 మే 2025 తదుపరి సైకిల్ కోసం సమర్పణ గడువు
సైకిల్ 5 - 1 మే 2025 – 27 జూన్ 2025
తేది కార్యాచరణ వ్యవధి
1 మే 2025 సైకిల్ 5 లో దరఖాస్తుల సమర్పణ గడువు
9 మే 2025
  • ప్రోగ్రామ్ ఆఫీసర్ చేసే ప్రీ-స్క్రీనింగ్ అర్హత తనిఖీ
  • ప్రారంభ ఫీడ్‌బ్యాక్ కోసం సంబంధిత సమూహాలు, సంస్థలు, సంఘాలు, బృందాలు అన్నిటినీ ప్రోగ్రామ్ ఆఫీసరు సంప్రదించడం
7 రోజులు
23 మే 2025 14 రోజులు
6 జూన్ 2025
  • అభ్యర్థికి తన ప్రతిపాదనపై ఫీడ్‌బ్యాక్ రావడం, దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చెయ్యడం
14 రోజులు
13 జూన్ 2025
  • నిర్ణయాల ప్రకటన
7 రోజులు
27 జూన్ 2025
  • గ్రాంట్ ప్రాసెసింగు, ఒప్పందంపై సంతకాలు చేయడం, గ్రాంట్ నిర్వాహకులచే గ్రాంటు చెల్లింపు
14 రోజులు
27 జూన్ 2025
  • ప్రాజెక్టు ప్రారంభించదగ్గ అతి దగ్గరి తేదీ

నివేదికను సమర్పించడం ఎలా

మీ సత్వర నిధికి ఆమోదం లభిస్తే, మీరు ఓ నివేదిక పంపించాల్సి ఉంటుంది. మీ ప్రాజెక్టు పూర్తైన 30 రోజుల లోపు ఆ నివేదిక పంపించండి.

  1. వికీమీడియా ఫౌండేషను గ్రాంటీ పోర్టల్ (Fluxx) కు వెళ్ళి లాగినవండి.
  2. ఎడమ వైపున ఉన్న పట్టీలో నివేదికలు (Reports) లో రాబోయేవి (Upcoming) లింకుకు వెళ్తే, రాబోయే నివేదికలన్నిటినీ చూడవచ్చు.
  3. సత్వర నిధి నివేదికను ఎంచుకుని మార్చు (Edit) ను నొక్కండి. ఫారంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఇది తెలుగులో నైనా రాయవచ్చు.
  4. నివేదిక రాయడం పూర్తయ్యాక, పంపించు (Submit) నొక్కి సమీక్ష కోసం పంపించండి.
  • ఈ నివేదికను మీరు ఆఫ్‌లైనులో కూడా తయారు చెయ్యవచ్చు. నివేదిక ఫారాన్ని కాపీ చేసుకుని, సమాధానాలు రాసి, ఆ తరువాతా దాన్ని Fluxx లోకి ఎక్కించవచ్చు.

వనరులు

నిధి ప్రతిపాదనలను తయారుచేయడంలో సలహాలు
ఇతర గ్రాంట్లు

మమ్మల్ని సంప్రదించండి

మీ కిష్టమైన భాషలో ప్రోగ్రాం ఆఫీసరును సంప్రదించండి:

Region Regional Program Officer Email address
Middle East & North Africa Farida El-Gueretly mena_rapid(_AT_)wikimedia.org
Sub-Saharan Africa Yop Rwang Pam ssa_rapid(_AT_)wikimedia.org
దక్షిణ ఆసియా Jacqueline Chen sa_rapid(_AT_)wikimedia.org
East, Southeast Asia, & Pacific Jacqueline Chen eseap_rapid(_AT_)wikimedia.org
Latin America & Caribbean Mercedes Caso lac_rapid(_AT_)wikimedia.org
ఉత్తర అమెరికా Chris Schilling na_rapid(_AT_)wikimedia.org
Northern & Western Europe Agnes Bruszik nwe_rapid(_AT_)wikimedia.org
Central & Eastern Europe & Central Asia Chris Schilling ceeca_rapid(_AT_)wikimedia.org

మూలాలు

  1. https://www.irs.gov/charities-non-profits/lobbying.
  2. సంస్థ బ్యాంకు ఖాతాకు అనుమతి ఉన్న వ్యక్తులు.