నిధుల సేకరణ/అనువాదం/ఆడ్రిఅన్నే డబ్ల్యూ విఙప్తి

From Meta, a Wikimedia project coordination wiki
Jump to navigation Jump to search
This page is a translated version of the page Fundraising 2012/Translation/AdrianneW Appeal and the translation is 100% complete.

1

ఆ పెద్ద నవలను పూర్తి చేయడానికి చాలా కాలం పట్టింది, కానీ నాకు నచ్చింది. ఐదవ తరగతిలో, మేము ఎంచుకున్న ఏదైనా విషయాన్ని స్నేహితులకు బోధించాలని ఒక పరీక్ష పెట్టారు. నేను పంతొమ్మిదో శతాబ్దపు సాహిత్యం మీద మాట్లాడాను.

ఈరోజు, బహుశా మీరు అంచనా వేసినట్టే, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్‌ని. నేను వికీపీడియాకు కూడా తోడ్పడతాను. ఫ్రాంకెన్‌స్టెయిన్‌ను రచించిన మేరీ షెల్లీ మరియు ప్రైడ్ అండ్ ప్రెజ్యుడిస్‌ను వ్రాసిన జేన్ ఆస్టిన్ వంటి రచయితల గురించి వ్యాసాలను సరిదిద్దుతూంటాను.

నేను ఎప్పుడైతే వికీపీడియాలో నా పనిని గురించి ఆలోచిస్తానో అప్పుడు వికీలో సమాచారం చేర్చిన మిగిలిన వారిలా నేను నా గురించి ఆలోచించను. నాకు నేను టీచర్లా ఆలోచిస్తాను. వికీపీడియా ద్చారా నేను తరగతి దాటి చాలా దూరం చేరుకున్నాను. గత మాసంలో మాత్రమే జనె ఆస్టెన్ వ్యాసాన్ని 115,000 మార్ల కంటే అధికంగా వీక్షించబడింది.

మా విశ్వవిద్యాలయంలో నేను అనేక నాణ్యమైన మూలాధారాలను పొందగలను. అయినప్పటికీ అనేక మంది ఈ వసతిని పొందలేరు. వారు దీనిని పొందడానికి మూల్యం చెల్లించాలి. వికీపీడియాలో నా రచనలు ఈ అన్యాయాన్ని ఎదిరించగలవు.

నేర్చుకోవడాన్ని నేను ప్రేమిస్తాను. నాకు అది ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉండడాన్ని నేను బలంగా విశ్వసిస్తాను.

మీరు దీనిని అంగీకరించినట్లైతే దయచేసి వికీపీడియాలో చేరి నా వాదన బలపరచండి.

Bio

ఆడ్రి అన్నే పరిశోధన 18వ శతాబ్ధపు బ్రిటిష్ సాహిత్యం మీద కేంద్రీకృతమై ఉన్నది. డిజిటల్ లార్నింగ్ అండ్ రీశర్చ్ కాబోయే డక్టరేట్ గా ఆమె తన సహాధ్యయూలకు వికీపీడియాను తరగతిగదిలో కలపడానికి కావలసిన సహాయాన్ని అందిస్తున్నారు.