Fundraising 2010/thank you/te

From Meta, a Wikimedia project coordination wiki

గమనిక[edit]

  • వికీపీడియా స్థాపించిన జిమ్మీ వేల్స్ నుండి
    ధన్యవాదాలు

ఉల్లేఖనం[edit]

  • "సమస్త మానవ జ్ఞాననిధిని ఈ భూమిపై ప్రతి వొక్క వ్యక్తికి వుచిత అందుబాటులో వున్న ప్రపంచాన్ని వూహించుకోండి."
  • — జిమ్మీ వేల్స్,వికీపీడియా స్థాపకుడు

వికీపీడియా స్థాపించిన జిమ్మీ వేల్స్ నుండి
ధన్యవాదాలు
[edit]

వారెవ్వా! నేను ఏమి చెప్పగలను? ధన్యవాదాలు.

మన చరిత్రలో అత్యంత విజయవంతమైన విరాళాలసేకరణ కార్యక్రమము ముగించాము, 8 వారాలలోపల $16 మిలియన్ అమెరికన్ డాలర్లు (7.2 కోట్ల రూపాయలు) సేకరించాము.

అద్భుతం. కాని నేను ఆశ్చర్యపడలేదు.

2001 లో, నేను ప్రజల పై పందెంకాశాను. మీరెప్పుడూ నన్ను తలవంచుకునేటట్లు చేయలేదు.

ఇంతకు ముందెన్నడూలేని, అతి పెద్దదైన మానవ జ్ఞాన నిధిని మీరు సృష్ఠించారు:270 భాషలలో 1.9 కోట్ల వ్యాసాలు, యింకా పెరుగుతూ, ప్రతిరోజు మెరుగవతూ. మీరు తోడ్పాటు అందించారు, విరాళమిచ్చారు, రక్షించారు.

ప్రకటనల ఆదాయం వికీపీడియా ఖర్చులను భరించదు. మీరే భరిస్తారు. వికీపీడియా ఐదవ అత్యంత వీక్షణలు గల జాలస్థలం – క్రిందటి నెలలో 40 కోట్ల ప్రజలు. మేము సేవికలు (servers) నడుపుటకు ఖర్చులను మరియు మా కొద్ది వుద్యోగుల జీతభత్యాలను మీ విరాళాలనుండే భరిస్తాము.

మీ విరాళాలే, వికీపీడియా ప్రకటనలు లేకుండా వుచితంగా అందుబాటులో వుంచుతాయి. ప్రపంచమొత్తానికి, జ్ఞానాన్ని వుచితంగా అందుబాటులోకి వుంచుతాయి.

వికీపీడియా వాస్తవంగా కొనసాగటానికి మీరు యిచ్చిన బహుమతికి ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలు నాకు స్ఫూర్తినిచ్చాయి మరియు మీకు వికీపీడియా పై గల ఉద్వేగాన్ని తెలుసుకొని గర్వంగా అనుభూతి చెందుతున్నాను.

అద్భుతమైన కథ.అటువంటిది మరొకటి లేదు. మీరింకా విరాళమివ్వనట్లైతే,సమయం మించిపోలేదు. మీరు జ్ఞానాన్ని వుచితంగా పంచుటకు తోడ్పడటానికి మీరు బహుమతి యివ్వటానికి యిక్కడ నొక్కండి అంతే మరి.

ఇంకొకసారి ధన్యవాదాలతో

జిమ్మీ వేల్స్

వికీపీడియా స్థాపకుడు

మరింత తెలుసుకోండి[edit]