అన్ని వికీలలో ఒకే వాడుకరిపేరు గల ఖాతా ఖరారు ప్రకటన/వ్యక్తిగత ప్రకటన

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Single User Login finalisation announcement/Personal announcement and the translation is 62% complete.
Outdated translations are marked like this.
Other languages:

మీ ఖాతా పేరు మారబోతోంది

నమస్కారం,

వికీలలో మీకొరకు సందేశాలను మీరు పనిచేసే ఏ వికీలోనైనా అందించుట వంటి కొత్త మరియు మెరుగైన పనిముట్లను మా వాడుకరులకు అందించే ప్రయత్నంలో భాగంగా, ఖాతాలు పనిచేసే విధానానికి కొన్ని మార్పులను వికీమీడియా డెవెలపర్ల జట్టు చేస్తోంది. ఈ మార్పుల వల్ల మీకు అన్ని వికీలలో ఒకే ఖాతా పేరు ఉంటుంది. దీనివల్ల మీరు మరింత మెరుగ్గా దిద్దుబాట్లు చెయ్యడానికి, చర్చలకు కొత్త సౌలభ్యాలనూ మరియు వివిధ పనిముట్లకు సౌకర్యవంతమైన వాడుకరి అనుమతుల నిర్వహణనూ ఇవ్వగలుగుతాము. దీని పర్యవసానం ఏమంటే 900 వికీమీడియా వికీలలోనూ వాడుకరి ఖాతాలు ఇప్పుడు విశిష్ఠంగా(అదే పేరు ఇంకొకరికి లేకుండా) ఉండాలి. మరింత సమాచారానికి ప్రకటనను చూడండి.

దురదృష్టవశాత్తూ, మీ ఖాతా {{subst:PAGENAME}} పేరు ఇంకొక వికీలో ఇంకొకరు వాడుతున్నారు. భవిష్యత్తులో మీరిద్దరూ అన్ని వికీమీడియా వికీలను ఘర్షణ లేకుండా ఉపయోగించుకునేలా చూడడానికి, మీ కోసం {{subst:PAGENAME}}~{{WIKI}} ఖాతా పేరుని నిలిపిపెట్టి వుంచాము. మీకు ఇది నచ్చితే, మీరు ఎమీ చేయక్కరలేదు. నచ్చకపోతే, వేరొక పేరు ఎంచుకోండి

మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది.

అసౌకర్యానికి చింతిస్తున్నాం.

మీ
కీగన్ పీటర్జెల్
కమ్మ్యునిటీ లైయేసన్, వికీమీడియా ఫౌండేషన్