వికీమీడియా మూవ్ మెంట్ చార్టర్ - పీఠిక
![]() | This page includes draft content of the Movement Charter. If you have feedback, please provide it on the talk page, or see other ways to give feedback in the consultations (including live meetings and surveys). |
పూర్తి అంశం చూడటానికి వెనక్కి వెళ్ళండి | విలువలు, సూత్రాల విభాగం
వికీమీడియా ఉద్యమం ప్రపంచానికి ఉచిత విజ్ఞానాన్ని అందించడం, విస్తరించడంపై దృష్టి సారించింది. దీని ప్రధాన విలువలు, సూత్రాలను నిర్వచించడానికి వికీమీడియా మూవ్‌మెంట్ చార్టర్ ఉంది. ఇది ఉద్యమంలోని సంస్థల మధ్య సంబంధాలను, వారి హక్కులు, బాధ్యతలను వివరించే అధికారిక సామాజిక ఒప్పందం. ఇది ఇప్పటికే ఉన్న సంస్థలకు, స్థాపించబోయే సంస్థలకు కూడా సమానంగా వర్తిస్తుంది.
అధికారిక ధృవీకరణ ప్రక్రియ ద్వారా దానిచే నిర్వహించబడే కమ్యూనిటీల ఒప్పందంతో చార్టర్ ఉనికిలో ఉంది. మూవ్‌మెంట్ చార్టర్ వికీమీడియా ఉద్యమంలోని సభ్యులందరికీ, సంస్థలకు, సాంకేతిక వ్యవస్థలకు వర్తిస్తుంది, ఇందులో సమాచార నిర్మాణకర్తలు, ప్రాజెక్ట్‌లు, అనుబంధ సంస్థలు, వికీమీడియా ఫౌండేషన్‌కు మాత్రమే పరిమితం కాదు.
వికీమీడియా దృష్టిని అన్ని వైపులా సాధించడానికి, బహుళ భాషలలో విస్తృత శ్రేణిలో జ్ఞాన సంబంధిత కార్యకలాపాలను అభివృద్ధి చేసింది. సమాచార తయారీ, నిర్వహణ, అలాగే కమ్యూనిటీ ప్రవర్తనకు సంబంధించి ప్రాజెక్ట్‌లు ఎక్కువగా స్వీయ పరిపాలన కలిగి ఉంటాయి. ఉద్యమం నిర్దిష్ట విషయాలు లేదా భౌగోళిక ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించిన వ్యవస్థీకృత, అనధికారిక సమూహాలను కూడా కలిగి ఉంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడమే ఈ సమూహాల ముఖ్య పాత్ర.
ఈ ఉద్యమంలో నిర్దిష్ట విషయాలు లేదా భౌగోళిక ప్రాంతాలపై దృష్టి సారించిన వ్యవస్థీకృత, అనధికారిక సమూహాలు కూడా ఉన్నాయి. అంచేత సముదాయాల సమన్వయంతో, ఆయా సమూహాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకారం అందించే భాద్యత కలిగి ఉంటాయి.
ఈ ప్రాజెక్ట్‌లు, సమూహాలకు అనుబంధంగా అనేక విషయాలతో కూడిన సమగ్రమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి. జ్ఞానాన్ని నిలుపుకోవడం కోసం ఆర్థికపరమైన వనరులను అందిస్తుంది. వికీమీడియా మూవ్‌మెంట్, దాని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పనిచేయడానికి వీలు కల్పించే చట్టపరమైన, నియంత్రణ వాతావరణాలను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నిస్తుంది. జ్ఞానాన్ని పంచుకునే, వినియోగించగలిగే సురక్షితమైన, ఉత్పాదక వాతావరణాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ వికీమీడియా ఉద్యమంలో భాగమైన సమాచార నిర్మాణకర్తలు, పాఠకులు, ఇతరులందరికీ స్వయంగా మౌలిక సదుపాయాలు అందిస్తుంది. ఉద్యమం విలువలు, వనరులు, ఉద్యమం వెలుపల విధించిన పరిమితుల ద్వారా మౌలిక సదుపాయాల మద్దతు స్వభావం, పరిధి పరిమితం చేయబడింది.
గమనికలు
- ↑
This wording has been highlighted as a potential concern by the Wikimedia Foundation Legal department, who proposed the following alternative wording: The projects are built with systems of self-governance. This was on two primary grounds:
- చట్టపరమైన బాధ్యతలను అధికారికంగా పాటించే సామర్థ్యం ఏ సంస్థ లేదని విశ్వసించేలా ఇది బాహ్య సంస్థలను (ముఖ్యంగా శాసన సంస్థలు) తప్పుదారి పట్టించవచ్చు.
- అదనంగా, "ఎక్కువగా" అనేది చాలా అస్పష్టంగా ఉంది, ప్రస్తుతం స్థానిక ప్రాజెక్ట్ స్వీయ-పరిపాలనకు చేరుకోవడం లేదా పరిమితులపై తగిన స్పష్టతను అందించే పొరుగు వాక్యాలు ఏవీ లేవు.
ఇవి చెల్లుబాటు అయ్యే ఆందోళనలని ఎంసిడిసి విశ్వసిస్తుంది, అయితే ఆంగ్లంలో ప్రస్తావించిన వ్యాఖల అర్థమే దీనికి మూలంగా నిలుస్తుంది.
అందుచేత:
చట్టపరమైన ఆందోళనలను సంతృప్తిపరిచేటప్పుడు అర్థాన్ని సంగ్రహించగల ఏవైనా సూచనలు మరియు నిర్దిష్ట వివరణలు పరిగణలోకి తీసుకోబడతాయి.
పూర్తి అంశం చూడటానికి వెనక్కి వెళ్ళండి | విలువలు, సూత్రాల విభాగం